లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నాం: డీజీపీ

ABN , First Publish Date - 2021-05-22T22:41:32+05:30 IST

తెలంగాణలో లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో

లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నాం: డీజీపీ

హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంగించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 6 నుండి ఉదయం 10 లోపు నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయాలని సూచించారు. ఉతయం 10 తర్వాత అనవసరంగా రోడ్ల మీదికి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. ఇంటర్ స్టేట్ బార్డర్స్ వద్ద లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. మినహాయింపు వారు కాకుండా ఇతరులు రోడ్ల మీదికి రాకూడదని చెప్పారు. కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలని మహేందర్‌రెడ్డి కోరారు.



రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారని, నగరాల్లో, పట్టణాల్లో మాత్రం మరింత సమర్థవంతంగా అమలు కావాల్సి ఉందని అన్నారు. దీనిపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా సాధారణ కార్యకలాపాలకు వెసులుబాటు ఉంటున్నందున.. 10.10 గంటల తర్వాత పాస్‌హోల్డర్స్‌ తప్ప.. మరెవరూ రోడ్లపై కనిపించడానికి వీల్లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-22T22:41:32+05:30 IST