లాక్‌డౌన్ 4.0 ఎత్తేస్తే... ప‌రుగులు పెట్ట‌నున్న మెట్రో!

ABN , First Publish Date - 2020-05-30T15:14:49+05:30 IST

లాక్‌డౌన్ 4.0ను ఎత్తేసిన ప‌క్షంలో యూపీలోని లక్నోలో మెట్రో సేవ‌లు జూన్ ఒక‌టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. లక్నో మెట్రోకు సంబంధించిన‌ ఉత్తర, దక్షిణ కారిడార్ల‌లో రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి ఉత్తర ప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది.

లాక్‌డౌన్ 4.0 ఎత్తేస్తే... ప‌రుగులు పెట్ట‌నున్న మెట్రో!

ల‌క్నో: లాక్‌డౌన్ 4.0ను ఎత్తేసిన ప‌క్షంలో యూపీలోని లక్నోలో మెట్రో సేవ‌లు జూన్ ఒక‌టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. లక్నో మెట్రోకు సంబంధించిన‌ ఉత్తర, దక్షిణ కారిడార్ల‌లో రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి ఉత్తర ప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. ఈ సంద‌ర్భంగా మెట్రో ఎండి కుమార్ కేశవ్ సంస్థాగ‌త‌ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.స్టేషన్ ప్రాంగణంతో  పాటు మెట్రో రైళ్లను పరిశుభ్రంగా ఉంచాలని కుమార్ కేశవ్ అధికారులను ఆదేశించారు. టికెట్ కౌంటర్లు, టికెట్ వెండింగ్ మెషీన్లు, కస్టమర్ కేర్ సెంటర్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు, ఎఎఫ్‌సి మెషీన్లు, స్టేష‌న్ లోపల హ్యాండ్‌రైల్స్‌, ఎస్కలేటర్ల హ్యాండ్‌రెయిల్స్ మొదలైనవాటిని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్ర‌ప‌రుస్తుండాల‌ని ఆదేశించారు. స్టేషన్‌లోని సిబ్బంది మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు‌ ధరించి సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని ఎండి ఆదేశించారు. మెట్రో స్టేషన్లలోని వాష్‌రూమ్‌ల‌లో టిష్యూ పేపర్‌తోపాటు శానిటైజర్‌ను అందుబాటులో ఉంచ‌నున్నామ‌న్నారు.  

Updated Date - 2020-05-30T15:14:49+05:30 IST