లాక్‌డౌన్‌ నుంచి విముక్తి కల్పించండి

ABN , First Publish Date - 2020-05-30T09:13:02+05:30 IST

కృష్ణలంక, రాణిగారితోట, మాచవరంలోని కార్మికనగర్‌ ప్రాంతాల ప్రజలను లాక్‌డౌన్‌ ఇబ్బందుల నుంచి బయటపడేలా మిన హాయింపులు

లాక్‌డౌన్‌ నుంచి విముక్తి కల్పించండి

 కృష్ణలంక : కృష్ణలంక, రాణిగారితోట, మాచవరంలోని కార్మికనగర్‌ ప్రాంతాల ప్రజలను లాక్‌డౌన్‌ ఇబ్బందుల నుంచి బయటపడేలా మిన హాయింపులు ఇవ్వాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ సీపీ ద్వారకాతిరుమలరావును కోరారు. శుక్రవారం పోలీసు కమిషనరేట్‌లో సీపీని కలిసి వినతిప్రతం అందించారు. పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని సీపీ హామీ ఇచ్చినట్టు గద్దె తెలిపారు.


గుణదల : కార్మికనగర్‌, కృష్ణ్ణలంక ప్రాంతాల ప్రజలకు సడలింపులు వచ్చేలా నిర్ణయం తీసుకుంటామని సీపీ ద్వారకా తిరుమలరావు హామీ ఇచ్చినట్లు తూర్పు వైసీపీ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌ తెలిపారు.


రామలింగేశ్వరనగర్‌ : తూర్పు నియోజకవర్గ కరకట్ట ప్రజల చిర కాల వాంఛ అయిన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారం భిస్తామని దేవినేని అవినాష్‌ తెలిపారు. 

Updated Date - 2020-05-30T09:13:02+05:30 IST