ఉద్యాన పంటల విక్రయాలకు అనుమతి

ABN , First Publish Date - 2020-04-03T11:08:35+05:30 IST

ఉద్యాన పంటల విక్రయాలకు అనుమతి

ఉద్యాన పంటల విక్రయాలకు అనుమతి

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 2: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యాన పంటల విక్రయాల విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా అనుమతులు జారీ చేసినట్లు జేసీ శ్రీనివాసరావు అన్నారు. ఈమేరకు గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సమీక్షించారు. ఉద్యానవన పంటల ధరల నియంత్రణకు సూచనలు జారీ చేశారు. ధరలపై  ఎప్పకటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.  సమావేశంలో టెక్కలి, శ్రీకాకుళం ఉద్యానవన సహాయ సంచాలకులు ఆర్‌.వి.వి. ప్రసాద్‌, పి.ఎల్‌. ప్రసాద్‌  తదితరులు పాల్గొన్నారు. 


 ఇంటికే కూరగాయలు

శ్రీకాకుళం నగరంలోని ఇంటింటికీ కూరగాయలు అందించేందుకు ఆర్‌ఆర్‌ వెజిటబుల్స్‌, దుర్గా వెజిటబుల్స్‌ సంస్థలు ముందుకు వచ్చాయని జేిసీ తెలిపా రు. సాయంత్రం 7.30 గంటల లోగా ఫోన్‌ ద్వారా ఆర్డర్‌ చేసిన వారికి మరుసటి రోజు ఉదయం  అందించనున్నారన్నారు. ఆర్‌.ఆర్‌. విజిటబుల్స్‌   7386875476/ 8179717588...దుర్గా వెజిటబుల్స్‌  9133096237/9110777234 లను నగరవాసులు సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2020-04-03T11:08:35+05:30 IST