మల్లె, మామిడి రైతుల స్థితి దయనీయం

ABN , First Publish Date - 2020-04-03T09:20:20+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. మైలవరం మండలం చండ్రగూడెంలోని 800 ఎకరాల్లో మల్లెల తోటలు సాగవుతు న్నాయి.

మల్లె, మామిడి రైతుల స్థితి దయనీయం

రెడ్డిగూడెం/మైలవరం రూరల్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. మైలవరం మండలం చండ్రగూడెంలోని 800 ఎకరాల్లో మల్లెల తోటలు సాగవుతు న్నాయి. శుభకార్యాలు ఆగిపోవడంతో మల్లెలు కొనే నాథుడు లేకుండా పోయాడు. చాలా మంది రైతులు మల్లెలను కోయించడమే మానేశారు.   మార్కె టింగ్‌ చేసుకునే అవకాశం లేక మామిడి కోతలు ఆపేశారు.   భౌతిక దూరం పాటించాల్సి రావడంతో జి.కొండూరు మండలంలో మిర్చి కోతలుకు కూలీలు కొరత ఏర్పడింది. చాలా మంది రైతులు మిరప చేలను దున్నేస్తున్నారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా ఆయన పర్యటించి అన్నదాతల కష్టాలను  తెలుసుకున్నారు. రైతు బజార్లలో మామిడి, మల్లెలు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 

Updated Date - 2020-04-03T09:20:20+05:30 IST