Abn logo
May 16 2021 @ 23:48PM

ఎక్కడికక్కడ కట్టడి

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ 


నాగర్‌కర్నూల్‌ టౌన్‌/పెంట్లవెల్లి/ఉప్పునుంతల/చారకొండ, మే 16 : కరోనా కట్టడికి వి ధించిన లాక్‌డౌన్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం జి ల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం పది గంటల వరకు ని త్యవసర సరకుల కొనుగోలు కోసం ప్రజలను రోడ్లపైకి అనుమతించడంతో, అంతలోపు రోడ్ల న్నీ జనాలతో దర్శమిచ్చాయి. నిర్దేశించిన సమయం ముగిసిన అనంతరం పోలీసులు పెట్రో లింగ్‌ నిర్వహించి షాపులను మూసి వేయించడంతో పాటు ప్రజలను ఇళ్లకు పంపిస్తున్నారు. అత్యవసర పనుల నిమిత్తం వచ్చే వారికి తప్ప, ఇతరులకు అనుమతి ఇవ్వడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే వారిని కూడా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. కొల్లా పూర్‌ చౌరస్తా, ఉయ్యలవాడల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అనవసరంగా వచ్చే వాహనదారులను విచారించి సరైన ఆధారాలు చూపకపోతే ఫొటో తీసి జరిమానాలు వి ధిస్తున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన రోడ్డుతో పాటు నల్లవెల్లి రోడ్డు, శ్రీపురం రోడ్డు, సంతబజారు తదితర ప్రాంతాలన్ని నిర్మానుష్యంగా కనిపించాయి. 

- లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శ్రీనివా సులు హెచ్చరించారు. పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో ఆదివారం చెక్‌పో స్టు వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎస్‌కే ఖాజా పాల్గొన్నారు.

- లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రమేశ్‌ హెచ్చరించారు. ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామంలోని శ్రీశె లం-హైదరాబాద్‌ రహదారి సమీపంలో ఆదివారం నిర్వహించిన మేకలు, గొర్రెల సంతను బంద్‌ చేయించారు. 

- లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేసేందుకు పోలీసులకు ప్రజ లు, వ్యాపారులు సహకరించాలని ఎస్‌ఐ కృష్ణదేవ కోరారు. ఆది వారం చారకొండ మండలంలోని ఆయా గ్రామాల్లో ఆయన పర్యటించి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నిబంధనలను త ప్పనిసరిగా పాటించాలని ఆయన ప్ర జలకు సూచించారు.

Advertisement