లాక్‌ అయినా వాడొచ్చు!

ABN , First Publish Date - 2022-01-29T05:30:00+05:30 IST

ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే మెయిల్‌ జీమెయిల్‌. ప్రపంచ వ్యాప్తంగా దీనిని రెండు వందల కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. ..

లాక్‌ అయినా వాడొచ్చు!

ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే మెయిల్‌ జీమెయిల్‌. ప్రపంచ వ్యాప్తంగా దీనిని రెండు వందల కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించుకోవాలంటే జీమెయిల్‌ అకౌంట్‌ తప్పనిసరి. దీన్నిబట్టి డిజిటల్‌ లైఫ్‌లో దానికి ఉన్న ప్రాధాన్యం తెలుసుకోవచ్చు. గూగుల్‌ ఫొటోస్‌, గూగుల్‌ డాక్స్‌, గూగుల్‌ మీట్‌ సహా గూగుల్‌ అందించే వివిధ సదుపాయాలను అందుకోవాలంటే జీమెయిల్‌ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కోసారి జీమెయిల్‌ అకౌంట్‌ లాక్‌ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలా అయిన పక్షంలో దానిని ఓపెన్‌  చేయడానికి కూడా కొన్ని టెక్నిక్‌లు ఉన్నాయి.... 


 షేర్‌ చేసిన రికవరీ సమాచారం గుర్తులేకుంటే, గూగుల్‌ అకౌంట్‌ పేజీపైనే దాన్ని చెక్‌ చేయాలి. ‘వేస్‌ ఉయ్‌ కెన్‌ వెరిఫై ఇట్స్‌ యు’ వద్దకు స్ర్కోల్‌ డౌన్‌ చేయాలి. ఇది రికవరీ ఫోన్‌ నంబర్‌ లేదంటే ఈమెయిలా అన్నది చూపుతుంది.

 సెల్‌ ఫోన్‌లు ఇప్పటి మాదిరిగా అందుబాటులో లేని రోజుల్లో ఈమెయిల్‌ అన్‌లాక్‌ చేసేందుకు సీక్రెట్‌ సెక్యూరిటీ ప్రశ్నలతో పనిపడేది. ఈమెయిల్‌ ఐడి, ఫోన్‌ నంబర్‌ లేని పక్షంలో ఈ పద్ధతి ఒక్కటే ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో సాధ్యమైనన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. జవాబు తెలియదని ఏ ప్రశ్ననూ వదిలిపెట్టవద్దు. సమాధానం తెలియక మరో ప్రశ్న వద్దకు వెళ్ళే ప్రయత్నం కంటే, అడిగిన ప్రతి ప్రశ్నకు కనీసం ఊహించైనా జవాబు ఇవ్వడం మంచిది. 

 ఇంతకుమునుపు ఉపయోగించిన పాస్‌వర్డ్‌తోనూ ఒక్కోసారి పనికావచ్చు. అందువల్ల ఉపయోగంలో లేని పాస్‌వర్డ్‌లను రికార్డు చేసి ఉంచుకోవడం కూడా మంచి ఐడియానే. ఒకవేళ అవేవీ గుర్తుకు రానిపక్షంలో గెస్‌పై అధారపడాలి. 

 అన్ని రకాలుగా విఫలమైతే, అకౌంట్‌ని అస్సలు ఎప్పుడు ప్రారంభించారని గూగుల్‌ అడుగుతుంది. అయితే అది చెప్పలేకపోవచ్చు. అయినప్పటికీ ఊహించి చెప్పినా వర్కౌట్‌ కావచ్చు. ఇంతకుమునుపు మెయిల్స్‌, వెల్‌కమ్‌ మెయిల్‌ ఈ విషయంలో తోడ్పడవచ్చు.


పాస్‌వర్డ్‌కు బదులు మొబైల్‌ నంబర్‌తో సైన్‌ ఇన్‌ కావాలి. 

 పాస్‌వర్డ్‌/ ఓటీపీ పంపేందుకు గూగుల్‌ ఒక ఆప్షన్‌ ఇస్తుంది. ఈమెయిల్‌  ఐడీ లేదంటే ఫోన్‌ నంబర్‌ అది అవుతుంది. ఆ సందర్భంలో అప్పటికి(కరెంట్‌) ఉపయోగంలో ఉన్నది ఉపయోగించాలి. 

 మీరు లాగ్‌ అయిన ఐఫోన్‌ లేదంటే ఐపాడ్‌ల్లో ఏదో ఒకటి ఉపయెగించాలి. డివైస్‌ ఎన్నడూ పాస్‌వర్డ్‌ అడగదు. ఆ కారణంగా వెరిఫై చేసుకునేందుకు డివైస్‌ని ఉపయోగించుకోవడం మంచిది.



 

 ఆండ్రాయిడ్‌ ఫోన్‌లన్నీ గూగుల్‌కు లింకై ఉంటాయి. అందువల్ల గూగుల్‌తో లింకై ఉన్న ఫోన్‌తో వెరిఫికేషన్‌ బెస్ట్‌. గూగుల్‌ అథెంటికేషన్‌ యాప్‌ కూడా మంచిదే. ర్యాండమ్‌గా జనరేట్‌ అయ్యే నంబర్‌తో లాగిన్‌ ఉపయోగించుకోవడాన్ని కన్‌ఫర్మ్‌ చేసుకోవచ్చు. 


 కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, పీసీ - ఏదైనా డివైస్‌తో లాగిన్‌ అయ్యేందుకు యత్నించాలి.  ఎక్కువగా ఏ డివైస్‌తో లాగిన్‌ అవుతారో, ఎందులో బ్రౌజ్‌(క్రోమ్‌/ సఫారి) అవుతారో, అదే కొనసాగించాలి. వర్క్‌, హోమ్‌వర్క్‌ ఏదైనప్పటికీ ఎక్కడి నుంచి లాగిన్‌ అవుతారో అదే కొనసాగించాలి.

Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST