‘గవర్నమెంట్ లాక్‌డౌన్ ఫండ్’‌.. దీన్ని నమ్మకండి: పోలీసులు

ABN , First Publish Date - 2020-11-25T22:04:50+05:30 IST

‘గవర్నమెంట్ లాక్‌డౌన్ ఫండ్’ పేరుతో వాట్సప్‌లలో వైరల్ అవుతున్న వార్తను నమ్మొద్దని హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘గవర్నమెంట్ లాక్‌డౌన్ ఫండ్’‌.. దీన్ని నమ్మకండి: పోలీసులు

హైదరాబాద్: ‘గవర్నమెంట్ లాక్‌డౌన్ ఫండ్’ పేరుతో వాట్సప్‌లలో వైరల్ అవుతున్న వార్తను నమ్మొద్దని హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ వార్తను ఫేక్ న్యూస్‌గా నిర్ధారించారు. లాక్‌డౌన్ సమయానికిగాను రూ.7500 ఆర్థిక సాయాన్ని అందివ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందంటూ సదరు వాట్సాప్ సందేశంలో ప్రచారం అవుతోంది. మెసేజ్‌లో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే డబ్బులు పొందవచ్చని అందులో ఉంది. ఈ పరిహారాన్ని ఒకసారి మాత్రమే పొందవచ్చని.. తక్కువ సమయం మాత్రమే ఉందంటూ ఆ మెసేజ్ తెలుపుతోంది. ఈ మెసేజ్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుండటంతో తాజాగా పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చారు.    



Updated Date - 2020-11-25T22:04:50+05:30 IST