లాక్ డౌన్ @ ప్రేమ

ABN , First Publish Date - 2021-08-16T09:13:01+05:30 IST

క్రితం కాలం నుంచి ప్రపంచం అలా నిలిచిపోయింది కానీ నువ్వూ నేనూ ఈ ప్రపంచమూ అందరూ... అలా నిర్జీవంగానో కొంచెం సజీవంగానో ప్రవహిస్తుంటాం

లాక్ డౌన్ @ ప్రేమ

క్రితం కాలం నుంచి

ప్రపంచం అలా నిలిచిపోయింది

కానీ నువ్వూ నేనూ ఈ ప్రపంచమూ అందరూ

అలా నిర్జీవంగానో కొంచెం సజీవంగానో ప్రవహిస్తుంటాం

అక్కడే కొన్ని రెక్కలు మాత్రం నడుస్తుంటాయి

ఎక్కడ రెక్కలు...

ఇక్కడ రెక్కలు...

ఎక్కడ తెగిన రెక్కలు

వాటికి కాళ్ళకు రెక్కలు కట్టుకుంటాయో

అక్కడ ఒక సముద్రం రెక్కలు తెచ్చుకుని ఎగురుతుంటుంది

ప్రపంచమూ, నువ్వూనేనూ కూడా అంతేకదా...

ఒక భూగర్బ సూర్యుడి వలె

చీకటి ప్రేమలా భగభగలాడతాము కదా, 

నిర్జీవమైనా ప్రవహిద్దామనుకుంటాము కదా.

నువ్వు కొంచెం మన కౌగిలిని

నేను నీ నీ చేతులను

తడిమి అలమటిస్తున్నట్లే

వర్షం ధాటికి ఊగిసలాడిన పువ్వులా

ప్రపంచమూ విలవిలలాడుతుంది

అచ్చం అలానే మన ప్రేమ కూడా..

కాలం లాక్డౌన్‌ అయినచోట

ఈ ప్రదేశమో, ఈ నగరమో, అంత వరకూ 

అంచు అంచునా ప్రేమ నింపుకోవడం వల్లనో

లేదా మన నరనరాన రక్తం ప్రేమ వెల్లువై పిలిచినందుకూ కాదు కానీ

నువ్వు నేను ఒకరికొకరు, ప్రపంచమూ తనకు తాను పరాయి కాబట్టి 

గాఢంగా కౌగిలించుకుంటాము

కాలం లాక్డౌన్‌ అయిన చోట

ఆ రెక్కలు వచ్చిన సముద్రమూ ,

ఇంకా రెక్కలు రాని ఆకాశం కింద ప్రేమలు నిర్జీవ ప్రవాహమై, 

కౌగిలి స్తంభించిపోయి ప్రియా...

లాలస


Updated Date - 2021-08-16T09:13:01+05:30 IST