లాక్‌డౌన్‌లో ఈ-పాస్‌లు

ABN , First Publish Date - 2020-03-31T09:04:48+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యవసర సేవలు, ని త్యావసరాల సరుకుల సరఫరాలో భాగస్వామ్యమైన వారి కి ఎమర్జెన్సీ పాస్‌లు అందించనున్నట్టు కోవిడ్‌ నివారణ ప్రత్యేక పర్యవేక్షణాధికారి, చేనేత,

లాక్‌డౌన్‌లో ఈ-పాస్‌లు

  • క్యూఆర్‌ కోడ్‌తో జారీ
  • ప్రత్యేక పర్యవేక్షణాధికారి హిమాన్హు శుక్లా


అమరావతి, విజయవాడ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌  నేపథ్యంలో రాష్ట్రంలో అత్యవసర సేవలు, ని త్యావసరాల సరుకుల సరఫరాలో భాగస్వామ్యమైన వారి కి ఎమర్జెన్సీ పాస్‌లు అందించనున్నట్టు కోవిడ్‌ నివారణ ప్రత్యేక పర్యవేక్షణాధికారి, చేనేత, జౌళిశాఖ సంచాలకుడు హిమాన్హు శుక్లా తెలిపారు. సోమవారం విజయవాడలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఉదయం 6గంటల నుంచి 11 గంట ల వరకు ప్రజలకు నిత్యావసరాలను కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. వాటిని సరఫరా చేసే వాహనాలకు పాస్‌లు లేకపోవడంతో కొన్ని చెక్‌పోస్టుల వద్ద ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య లేకుండా చేయడానికే ఈ-పా్‌సల విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రధానంగా ప్రైవేట్‌ రంగ కర్మాగారాలు, కార్యాలయాలు, సంస్థల్లో పని చేసే ఉద్యోగుల కోసం ‘కోవిడ్‌-19 అత్యవసర పాస్‌’లు జారీ చేస్తామన్నారు. పాస్‌ పొందేందుకు ఎవ్వరూ కార్యాలయాలకు రానవసరంలేదని, ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చని తెలిపారు.https://gramawa rdsac hivalayam.ap.gov.in/cvpassapp/cv/cvorgani zationregis-rtion ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

Updated Date - 2020-03-31T09:04:48+05:30 IST