క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తించాలి

ABN , First Publish Date - 2022-05-21T06:11:20+05:30 IST

ప్రతీ గ్రామపంచాయతీలో గ్రామీణా క్రీడాప్రాంగణాలకు స్థలాలు గుర్తించాల ని తహసీల్దార్లు, ఎంపీడీవోలను కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటల్‌ ఆదేశించారు

క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌, పాల్గొన్న అధికారులు

వీడియోకాన్పరెన్స్‌లో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ 

నల్లగొండ టౌన్‌, మే 20: ప్రతీ గ్రామపంచాయతీలో గ్రామీణా క్రీడాప్రాంగణాలకు స్థలాలు గుర్తించాల ని తహసీల్దార్లు, ఎంపీడీవోలను కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటల్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టరేట్‌ నుంచి వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామపంచాయతీల పరిధిలో ఎకరం స్థలానికి తగ్గకుండా తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు అధికారు లు చర్యలు తీసుకోవాలని, జూన్‌ 2వ తేదీ వరకు ప్రతీ మండలంలో రెండుచోట్ల క్రీడా ప్రాంగణాలను ప్రారంభించడానికి స్థలాలతో అవసరమైన మరమ్మతులు చేయించాలన్నా రు. క్రీడా ప్రాంగణాలను గ్రామంలో దూరంగా కాకుండా పిల్లలు, యువతకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. జిల్లాలోని అన్ని క్రీడా ప్రాంగణాలు ఒకేవిధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ మండలంలోని ఐదు గ్రామపంచాయతీల్లో బృహత్‌పల్లె, ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని, స్థలాలు లేని చోట అటవీ భూములను పరిశీలించాలన్నారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం జూన్‌ 5వరకు ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, పంచాయతీ అధికారి విష్ణువర్థన్‌, డీఆర్‌డీవో కాళిందిని పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:11:20+05:30 IST