సంస్థ ప్రతినిధితో మాట్లాడుతున్న ప్రగడ నాగేశ్వరరావు
రాంబిల్లి, జనవరి 27: సెజ్‌లోని లారస్-2 కర్మాగారంలో స్థానికులకు, నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ కన్వీనర్ ప్రగడ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన పలువురు టీడీపీ నాయకులతో సంస్థ మేనేజర్ మోహరాను కలిశారు. సెజ్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన నిర్వాసితులు, గ్రామాల్లో యువత ఉద్యోగావకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. టీడీపీ నాయకులు నీరుకొండ నర్శింగరావు, లాలం రాజు, డి.శ్రీనివాసరావు జి.నానాజీ, లాలం తాతబాబు, నాగేశ్వరరావు, దొడ్డి శ్రీనివాసరావు, ఎస్.రమణ, కొండబాబు పాల్గొన్నారు.