పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యం

ABN , First Publish Date - 2021-01-26T06:03:06+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం తథ్యమని మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యం
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి

  1.  మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి 


కోసిగి, జనవరి 25: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం తథ్యమని మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కందుకూరు గ్రామంలో విలేఖరుల సమావేశంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేయకపోవడంపై వారి తీరుపై ఆయన మండిపడ్డారు. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎన్నికలు జరపాలని పట్టుబట్టిన సీఎం జగన్‌.. నేడు కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టి.. ఎన్నికలు నిర్వహించడంలో వెనుకడుగు వేస్తున్నారని, ఎన్నికల కమిషనర్‌తో విభేదాలు పెట్టుకుని ఎన్నికలు జరగకుండా అడుగడుగునా అడ్డు పడుతున్నారన్నారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, పత్తికొండ టీడీపీ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబులపై పోలీసులు కేసులు పెట్టడం దారుణమన్నారు. అధికార పార్టీ నాయకులు అడుగడుగునా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి, సభలు సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించినా.. అధికారులకు కనబడడం లేదా అని మండిపడ్డారు. సుప్రీం కోర్టు కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తీర్పునివ్వడం శుభపరిణామమని  పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, నాడిగేని అయ్యన్న, గుడిసె శ్రీరాములు, రామన్నగౌడు, అయ్యన్న, జ్ఞానేష్‌, మంజునాథ్‌, చిరుక తాయన్న, చింతలగేని నర్సారెడ్డి, సల్మాన్‌ రాజు, రామలింగ, సొట్టయ్య, బుజ్జి, హనుమంతు, నాగేష్‌, రామాంజినేయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T06:03:06+05:30 IST