Abn logo
Sep 10 2020 @ 06:46AM

నకిలీ పత్రాలతో బ్యాంకులో రుణం.. నిందితుడు అరెస్ట్‌

Kaakateeya

హైదరాబాద్‌ : ఇతరులకు అమ్మిన ఆస్తి పత్రాలను స్వల్పంగా మార్చి, మరొకరికి అమ్మినట్లుగా పత్రాలు సృష్టించి బ్యాంకులో రుణం తీసుకుని చెల్లించకుండా తప్పించుకుతిరుగుతున్న మోసగాడిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం లింగోజిగూడలో 10540 చదరపుగజాల స్థలానికి పట్టాదారు రహీముద్దీన్‌. ఇతడు 2005లో ఈ స్థలాన్ని ఇతరులకు విక్రయించాడు. మోకిల ప్రాంతానికి చెందిన ఈగర్‌బక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ గుంటి సుమన్‌ ఈ దస్తావేజులను మార్చి ఈ స్థలాన్ని ఇతరులకు విక్రయించినట్లు దస్తావేజులు సిద్ధం చేశాడు.

అనంతరం మరో ముగ్గురితో కలిసి నానల్‌నగర్‌లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఈ పత్రాలు సమర్పించి రూ.5.90 లక్షల రుణం పొందాడు. తర్వాత లోన్‌ సరిగా చెల్లించకుండా ఆపేశాడు. స్థలం బ్యాంక్‌ అధికారుల ఆధీనంలో ఉండడంతో, అసలు కొన్న వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ చేపట్టిన పోలీసులు మోసానికి పాల్పడిన గుంటి సుమన్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
Advertisement