బాబు హయాంలో వైసీపీ నేతలకూ రుణమాఫీ

ABN , First Publish Date - 2022-10-03T09:17:23+05:30 IST

‘‘టీడీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని బేరీజు వేయడం మీతరం కాదు వీసారెడ్డీ...’’ అంటూ మాజీ మంత్రి అయ్యన్న

బాబు హయాంలో వైసీపీ నేతలకూ రుణమాఫీ

మరిచిపోయి మాట్లాడొద్దు: అయ్యన్న 


అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని బేరీజు వేయడం మీతరం కాదు వీసారెడ్డీ...’’ అంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేకు, జగన్‌ బంధువులకూ రైతు రుణమాఫీ అయిన విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారు. వైఎస్‌ మదన్మోహన్‌రెడ్డికి, జగన్‌ వదిన వైఎస్‌ మాధవీలతకు టీడీపీ హయాంలో రుణమాఫీ అయింది. వైఎస్‌ మధు అకౌంట్‌ నంబర్‌ 045213100036589కు రెండు విడతలుగా రూ.63వేలు, మూడోసారి రూ.36వేలు, మాధవీలత అకౌంట్‌ 045213100036613లో రెండు విడతలుగా రూ.59,643, మూడోసారి రూ.34,081 రుణమాఫీ జరిగింది’’ అని అయ్యన్న ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-10-03T09:17:23+05:30 IST