అన్నదాతకు ఊరట

ABN , First Publish Date - 2020-06-03T10:45:29+05:30 IST

అన్నదాతకు ఊరట కలిగించే అంశం. పంట రుణాల చెల్లింపులపై ప్రో త్సాహక వడ్డీ, రాయితీ వర్తింపు గడువును ఆర్‌బీఐ ..

అన్నదాతకు ఊరట

ఆగస్టు 31 వరకు పంటరుణాల చెల్లింపులపై ప్రోత్సాహక వడ్డీ, రాయితీ వర్తింపు


అనంతపురం క్లాక్‌టవర్‌, జూన్‌ 2: అన్నదాతకు ఊరట కలిగించే అంశం. పంట రుణాల చెల్లింపులపై ప్రో త్సాహక వడ్డీ, రాయితీ వర్తింపు గడువును ఆర్‌బీఐ పొడిగించినట్లు ఎల్‌డీఎం మోహన్‌ మురళి మంగళవారం ప్ర కటనలో తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి మే 31 మధ్య పంట రుణాలు చెల్లించిన రైతులకే ఇదివరకు ప్రోత్సాహక వడ్డీ, రాయితీ వర్తింపజేసేవారు. ఈ గడువు ముగిసింది. దీనిని ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించినట్లు ఎల్‌డీఎం తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న రైతన్నలకు ఊరట కల్పించేందుకే ఆర్‌బీఐ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.


జిల్లా వ్యాప్తంగా ఉ న్న రైతులు ఆగస్టు 31వతేదీలోపు పంట రుణాలు చెల్లిం చి, ప్రోత్సాహకవడ్డీ, రాయితీలను పొందాలని కోరారు. కరోనా లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేశాయన్నా రు. నిబంధనల సడలింపులో భాగంగా బ్యాంకు పనివేళలు కూడా మారుస్తూ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయం తీసుకుందన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళలు మారుస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-06-03T10:45:29+05:30 IST