నేడు వీధి వ్యాపారులకు రుణమేళా

ABN , First Publish Date - 2021-02-27T05:00:19+05:30 IST

నిజామాబాద్‌ నగరంతోపాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ పట్టణాల్లో ఆత్మనిర్భర్‌ పథకం కింద రుణం పొందేందుకు దరఖాస్తుచేసుకున్న వీఽధి వ్యాపారులకు శనివారం రుణమేళా నిర్వహిస్తున్నట్లు ఆయా మున్సిపల్‌ కమిషనర్లు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు.

నేడు వీధి వ్యాపారులకు రుణమేళా

నిజామాబాద్‌అర్బన్‌ / బోధన్‌ / ఆర్మూర్‌టౌన్‌ / భీమ్‌గల్‌,ఫిబ్రవరి 26 : నిజామాబాద్‌ నగరంతోపాటు బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ పట్టణాల్లో ఆత్మనిర్భర్‌ పథకం కింద రుణం పొందేందుకు దరఖాస్తుచేసుకున్న వీఽధి వ్యాపారులకు శనివారం రుణమేళా నిర్వహిస్తున్నట్లు ఆయా మున్సిపల్‌ కమిషనర్లు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం, బోధన్‌ మున్సిపల్‌, ఆర్మూర్‌ మున్సిపల్‌, భీమ్‌గల్‌ మున్సిపల్‌ కార్యాలయాల్లో  రుణమేళా ఉంటుందని పేర్కొన్నారు. రూ.10వేల రుణం కోసం దరఖాస్తు చేసుకొని ఇంకా రుణం పొందని వీధివ్యాపారులు రుణమేళకు గుర్తింపు కార్డు, పెండింగ్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డు, వీధి విక్రయదారుల సర్టిఫికెట్‌తో హాజరుకావాలని తెలిపారు. మున్సిపాలిటీ, మెప్మా, బ్యాంకర్లు సమావేశానికి హాజరుకానున్నారని పేర్కొన్నారు.


Updated Date - 2021-02-27T05:00:19+05:30 IST