అమ్మా.. నాన్నా క్షమించండి.. ఏ పనీ చేయలేకపోతున్నా.. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నా..!

ABN , First Publish Date - 2022-06-10T15:31:05+05:30 IST

అమ్మా.. నాన్నా క్షమించండి.. ఏపనీ చేయలేకపోతున్నా.. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నా..!

అమ్మా.. నాన్నా క్షమించండి.. ఏ పనీ చేయలేకపోతున్నా.. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నా..!

  • ‘లోన్‌యా‌ప్’ వేధింపులు
  • యువకుడి ఆత్మహత్య


హైదరాబాద్ సిటీ/జవహర్‌నగర్‌ : లోన్‌ యాప్‌ (Loan App) వారి వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. జవహర్‌నగర్‌ పోలీసులు, మృతుడి బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాదర్‌ ఆరేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ నుంచి భార్య, పిల్లలతో వచ్చి చెన్నాపురంలోని సాయిగణేశ్‌ కాలనీలో స్థిరపడ్డాడు. పండ్ల వ్యాపారం చేస్తున్న అతడికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఖాజా మొయినుద్దీన్‌(23) ఉన్నాడు. ఆన్‌లైన్‌లో ఉద్యోగం చేస్తున్నానని ఖాజా ఇంట్లో చెప్పాడు.


ఆరు నెలల క్రితం తండ్రికి సంబంధించిన రెండు ఫోన్‌లలో లోన్‌ యాప్‌ ద్వారా రూ. 50 వేల లోన్‌ తీసుకున్నాడు. వడ్డీ రూ. 40వేలు కట్టాలని లోన్‌వాళ్లు వేధిస్తున్నారు. దాంతో కొంత డబ్బు కట్టాడు. ‘ఏ ఉద్యోగం చేస్తున్నావు.. అప్పులు ఎక్కువ అవుతున్నాయి’ అని తండ్రి ఈనెల 8న కుమారుడిని నిలదీశాడు. రేపు జీతం వస్తుందని,అప్పులు తీర్చేస్తానని మొయినుద్దీన్‌ సమాధానమిచ్చాడు. అదేరోజు రాత్రి తల్లిదండ్రులు, సోదరి ఒక గదిలో నిద్రిస్తుండగా ‘‘అమ్మా.. నాన్నా నన్ను క్షమించండి..ఏపనీ చేయలేకపోతున్నాను.. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నా’’అంటూ ఖాజా సూసైడ్‌ నోట్‌ రాసి వంటగదిలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-06-10T15:31:05+05:30 IST