TS News: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

ABN , First Publish Date - 2022-07-22T22:00:19+05:30 IST

లోన్ యాప్ నిర్వాహకులపై ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. వారి ఆగడాలు మాత్రం ఆగడంలేదు.

TS News: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

మహబూబాబాద్ (Mahbubabad) జిల్లా: లోన్ యాప్ (Loan App) నిర్వాహకులపై ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. వారి ఆగడాలు మాత్రం ఆగడంలేదు. ప్రతి రోజూ ఎవరో ఒకరు లోన్ యాప్ బారిన పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా, బయ్యారానికి చెందిన శ్యామ్ సుందర్ అనే యువకుడు బలయ్యాడు. అత్యవసరంగా డబ్బులు అవసరం కావడంతో హ్యాండీ లోన్ యాప్ ద్వారా రూ. 3,500 రుణం తీసుకున్నాడు. స్పాట్‌లోనే రూ. 1224 వడ్డీ కింద కట్ చేసుకున్నారు. మిగతా సొమ్ము శ్యామ్ సుందర్‌కు ఇచ్చారు. వారం రోజుల తర్వాత బాధితుడు రూ. 3,500 చెల్లించాడు. అయినా లోన్ యాప్ నిర్వాహకులు లోన్ సొమ్ము కట్టాలంటూ వేధింపులకు గురిచేశారు. మళ్లీ కట్టకపోవడంతో శ్యామ్ సుందర్ ఫోటోలను మార్పింగ్ చేసి న్యూడ్‌గా మార్చి అతని బంధువులు, స్నేహితులకు పంపి వేధించారు. ఈ క్రమంలో బాధితుడు సెల్ఫీ వీడియోలో తన బాధను వ్యక్తం చేశాడు. లోన్ యాప్‌ల జోలికి ఎవరూ పోవద్దని, వాళ్లు అందరినీ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. లోన్ యాప్ మోసాలపై వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

Updated Date - 2022-07-22T22:00:19+05:30 IST