లోన్‌ యాప్‌లో.. అప్పు.. ముప్పు

ABN , First Publish Date - 2022-08-11T05:49:37+05:30 IST

అత్యవసరంగా డబ్బు అవసరమై లోన్‌ యాప్‌లో అప్పు తీసుకుని.. చెల్లించినా వేధింపులు తప్పడం లేదు.

లోన్‌ యాప్‌లో.. అప్పు.. ముప్పు

సకాలంలో బాకీ తీర్చనందుకు వేధింపులు.. 

భార్య ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి చిత్రాలు విడుదల

తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీసు 

స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు 


తాడేపల్లిగూడెం క్రైం ఆగస్ట్టు 10 : అత్యవసరంగా డబ్బు అవసరమై లోన్‌ యాప్‌లో అప్పు తీసుకుని.. చెల్లించినా వేధింపులు తప్పడం లేదు. ఓ వ్యక్తి భార్య చిత్రాన్ని మార్పింగ్‌ చేసి న్యూడ్‌ చిత్రాన్ని విడుదల చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాలివి.. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలుకు చెందిన వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా డు. అత్యవసరంగా సొమ్ము అవసరమై తోటి స్నేహితు లను రుణం అడిగేందుకు మొహమాటం అడ్డొచ్చి ఆన్‌ లైన్‌ యాప్‌ హ్యాండి లోన్‌ ద్వారా తన భార్య పేరుతో రూ.11 వేలు తీసుకుంటే చేతికి ఇచ్చింది తొమ్మిది వేలే. ఆ రుణం తీసుకున్న 11 రోజుల్లోగా చెల్లించాలి. తన జీతం రావడం ఒక రోజు ఆలస్యమవడంతో వెంటనే అతని ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. 

తన ఖాతాలో సొమ్ము లేదని వెంటనే బ్యాంకుకు వెళ్లి సొమ్ము జమ చేసి చెల్లిస్తానని బదులు ఇచ్చాడు. పది నిమిషాల వ్యవధిలోనే అతని భార్య ముఖానికి న్యూడ్‌ చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి వాట్సప్‌ ద్వారా అతనికి పంపిం చారు. వెంటనే చెల్లించకపోతే ఇది నీ కాంటాక్టు ఫ్రెండ్స్‌ అందరికీ పంపుతానని బెదిరించాడు. దీంతో స్నేహితు డిని ఫోన్‌పేలో సొమ్ము పంపాలని అడిగి వెంటనే రు ణం చెల్లించాడు. వేరే నెంబర్‌ నుంచి మళ్లీ అవే సందే శాలు వచ్చాయి. కొందరి స్నేహితుల కాంటాక్టు నెంబర్ల కు అతని భార్య మార్ఫింగ్‌ ఫోటోలు పెట్టారని స్నేహి తులు చెప్పడంతో అతను ఆందోళనలో మునిగాడు. ఈ విషయం ఇంట్లో వారికి తెలిస్తే పరువుతోపాటు వారు ఏమైనా చేసుకుంటారేమోనని భయంతో ఈ వివరాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయినా ఆ రుణ కేటుగాళ్ల నుంచి వేధింపులు ఆగలేదు. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఆ కుటుంబం పడిపో యింది. ఈ యాప్‌ హ్యాండీ లోన్‌ కార్యకలాపాలు అంతా ఆన్‌లైన్‌ ద్వారానే సాగుతున్నాయి. దీంతో వెంటనే తమ అవసరాలకు సొమ్ము ఇస్తామని చెబుతుండటంతో వారి అవసరం తీరుతుందని ఆశతో యాప్‌ వలలో పడుతు న్న వందలాది మందిని ఈ యాప్‌ పేరుతో ఆన్‌లైన్‌ కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. సొమ్ము చెల్లించినా వదలకుండా వారి నుంచి భారిగా సొమ్ములు వసూలు చేసేందుకు ఈ మార్ఫింగ్‌ను ఒక ఆయుధంలా వాడుతూ చెలరేగి పోతున్నారు. ఒకసారి అవసరానికి వారికి చిక్కితే ఆన్‌లైన్‌ యాప్‌ కేటుగాళ్లు వారి పని విచ్చలవిడిగా చేసుకుపోతున్నారు. మహిళలే లక్ష్యంగా వారి వేధింపులకు పాల్పడుతున్నారు. భర్తలు సొమ్ము తీసుకున్నా వారి ఫోన్‌ హ్యాక్‌ చేసి వారి భార్య పేరుతో ఉన్న ప్రొఫైల్‌ ఫొటోలను వెతికి మరీ ఈ మార్ఫింగ్‌లకు ఆయుధంగా వాడుతున్నారు.

Updated Date - 2022-08-11T05:49:37+05:30 IST