జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌

ABN , First Publish Date - 2021-07-31T05:54:29+05:30 IST

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఆర్మూర్‌కు చెందిన ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్త ర్వులు వెలువడ్డాయి. స్పీకర్‌ పోచారం శ్రీని వాస్‌రెడ్డి, జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సిఫారసు మేరకు రాజేశ్వర్‌ను పదవి వరించి ంది.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌

ఆర్మూర్‌, జూలై 30: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఆర్మూర్‌కు చెందిన ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్త ర్వులు వెలువడ్డాయి. స్పీకర్‌ పోచారం శ్రీని వాస్‌రెడ్డి, జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సిఫారసు మేరకు రాజేశ్వర్‌ను పదవి వరించి ంది. ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవి ర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. కే సీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 2001 నుంచి మూడేళ్లు రాష్ట్ర కార్యదర్శిగా, 2004లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 20 01నుంచి 2014 వరకు ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జిగా పని చేశారు. కేసీఆర్‌ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌ కేంద్ర బీడీ కార్మిక సలహా మండలి సభ్యుడిగా నియమించారు. ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే గాక, అంకిత భావంతో పార్టీ కోసం పని చేసినందుకు గుర్తింపు లభించినట్లయింది. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించిన రోజే రాజేశ్వర్‌ హైదరాబాద్‌ వెళ్లి మద్దతుపలికారు. మధ్యలో టీఆర్‌ఎస్‌ నుం చి కొంత మంది వలస వెళ్లిన సమయంలో రాజేశ్వర్‌ టీఆర్‌ఎస్‌లోనే ఉండి ఆర్మూర్‌లో ఉద్యమం చేశారు. కేసీఆర్‌ ఆర్మూర్‌ వచ్చిన సమయంలో రాజేశ్వ ర్‌ ఇంట్లోనే బస చేసేవారు. కేసీఆర్‌ అప్యాయంగా రాజన్న అని పిలిచేవారు. పార్టీని నమ్ముకుని ఉన్నందుకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. రాజేశ్వర్‌ స్పీ కర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు. కాగా.. తనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజేశ్వర్‌ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నా రు. తన నియామకానికి కృషి చేసిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-07-31T05:54:29+05:30 IST