మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు

ABN , First Publish Date - 2022-10-01T05:40:51+05:30 IST

నిరాదారణకు గురైన మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతోందని రాష్ట్ర సాంస్కృతికసారధి చైర్మన్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు.

మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
అన్నపూర్ణ రిజర్వాయర్‌ వద్ద పూజలు చేస్తున్న ఎమ్మెల్యే

- మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

ఇల్లంతకుంట, సెప్టెంబరు 30: నిరాదారణకు గురైన మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతోందని రాష్ట్ర సాంస్కృతికసారధి చైర్మన్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని అనంతగిరి సమీపంలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో శుక్రవారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉపాధిలేక మత్స్యకారులు వలస పోయేవారన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో గ్రామగ్రామాన కుంటలు నీటితో నిండిపోయాయన్నారు. చేపపిల్లలను ఉచితంగా అందించడమే కాకుండా మార్కెటింగ్‌ చేసుకోవడానికి సబ్సిడీపై వాహనాలు అందించిన ఘనత ప్రభుత్వానికి దక్కిందన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అంతకుముందు విద్యుదాఘాతంతో మృతిచెందిన బాలయ్య కుటుంబానికి సెస్‌ తరపున రూ.5లక్షల చెక్కు అందజేశారు. జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మామిడి సంజీవ్‌, సర్పంచ్‌ పల్లె నర్సింహరెడ్డి, ఎంపీటీసీ గొట్టెపర్తి పర్శరాం, మాజీ ఎంపీపీ అయిలయ్య, ఉపసర్పంచ్‌ బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

   ఫ బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సూచించారు. గాలిపెల్లిలో బతుకమ్మ తెప్పను ప్రారంభించారు. మహిళలు, బతుకమ్మ, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లుగారి వాణిదేవేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సింగిరెడ్డి శ్యామల, ఏఎంసీ డైరెక్టర్‌ ప్రశాంత్‌రెడ్డి, నాయకులు రాజేశం, శ్రీనివాస్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T05:40:51+05:30 IST