కాలేయానికి ఏది రక్ష?

ABN , First Publish Date - 2021-05-28T21:28:50+05:30 IST

కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి, దాని పని తీరును మెరుగు పరచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

కాలేయానికి ఏది రక్ష?

ఆంధ్రజ్యోతి(28-05-2021)

ప్రశ్న: కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి, దాని పని తీరును మెరుగు పరచడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- సంహిత, శ్రీకాకుళం


డాక్టర్ సమాధానం: శరీరంలోని అతి పెద్ద అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది శరీర రక్త సరఫరా నుండి మలినాలను  తొలగిస్తుంది. రక్తంలో ఆరోగ్యకరమైన చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకోవడంతో పాటు అనేక ఇతర విధులను నిర్వర్తిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే బరువును ఆరోగ్యకరమైన పరిమి తుల్లో నియంత్రించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆల్కహాలుకు దూరంగా ఉండడం లాంటివి పాటించాలి. అధిక కొవ్వులు ఉండే ఫ్రైడ్‌ ఫుడ్స్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌ తగ్గించాలి, స్వీట్లు, చక్కర ఎక్కువగా ఉండే చిరుతిళ్ళు కూడా మితంగానే తీసుకోవాలి. పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. డీహైడ్రేషన్‌ రాకుండా ఉండేందుకు రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. వేగంగా బరువు పెరగడం, వేగంగా బరువు తగ్గడం రెండూ కాలేయ ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరానికి తగినంత విశ్రాంతినిచ్చే నిద్ర కూడా కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమే.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-05-28T21:28:50+05:30 IST