కాలేయానికి ఇలా మేలు!

ABN , First Publish Date - 2022-03-20T05:30:00+05:30 IST

కాలేయం శరీరంలో పవర్‌హౌజ్‌ లాంటిది. మరి కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి....

కాలేయానికి ఇలా మేలు!

కాలేయం శరీరంలో పవర్‌హౌజ్‌ లాంటిది. మరి కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి.  ఈ విషయంలో నిపుణులు సలహాలివి...


బ్లాక్‌ టీ లేదా గ్రీన్‌ టీ కాలేయానికి మేలు చేస్తాయి. ఎంజైమ్‌ల తయారీకి ఈ టీలు ఉపయోగపడతాయి. ఈ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు లివర్‌ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను, లివర్‌ ఫ్యాట్‌ను తగ్గించడంలో గ్రీన్‌ టీ సహాయపడుతుంది. 


టోఫు కాలేయానికి మేలు చేస్తుంది. సోయాబీన్స్‌తో తయారుచేసే టోఫు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. 


సిట్రస్‌ పండ్లు కాలేయానికి మంచివి. నారింజ, గ్రేప్స్‌ వంటివి తినాలి. సి-విటమిన్‌ లివర్‌లో కొవ్వు నిలువ కాకుండా చూస్తుంది. గ్రేప్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని కాపాడతాయి. కాన్‌బెర్రీలు, బ్లూబెర్రీలు కూడా మంచివే. 


ఫైబర్‌ అధికంగా లభించే ఓట్స్‌ కూడా కాలేయానికి మంచివే. ఓట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయం త్వరగా రికవరీ అయ్యేందుకు సహాయపడతాయి. దెబ్బతిన్న కాలేయ కణాలు చనిపోవడాన్ని నెమ్మదించేలా చేస్తాయి. బీన్స్‌ కూడా కాలేయానికి మేలు చేస్తాయి.


కాఫీ తాగడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ముఖ్యంగా కాలేయ జబ్బులు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. కాఫీ తాగే వారిలో సిర్రోసిస్‌ వచ్చే అవకాశం బాగా తగ్గినట్టు అధ్యయనాల్లో తేలింది. కాఫీ మితంగా తాగితే లివర్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.


బ్రొక్కోలి, క్యాలీఫ్లవర్‌, పాలకూర వంటి కూరగాయలు కాలేయ ఆరోగ్యానికి మంచివి. నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ను నిరోధించడంలో ఇవి ఉపయోగపడతాయి. పాలకూరలో ఉండే గ్లూటథయోన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Updated Date - 2022-03-20T05:30:00+05:30 IST