ప్రత్యక్ష దైవాలు

ABN , First Publish Date - 2021-05-06T06:50:36+05:30 IST

కొవిడ్‌ మహమ్మారికి వేలాదిమంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కుటుంబసభ్యులకు చివరి చూపునకు దక్కక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రత్యక్ష దైవాలు
భూదాన్‌పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

కొవిడ్‌కు వెరవకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలు 

 ప్రజల ప్రాణాలు కాపాడుతున్న సేవకులు

భూదాన్‌పోచంపల్లి, మే 5: కొవిడ్‌ మహమ్మారికి వేలాదిమంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కుటుంబసభ్యులకు చివరి చూపునకు దక్కక  ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయితే  కుటుంబసభ్యులే భయం భయంగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి.  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రత్యక్ష దైవాలుగా నిలుస్తున్నారు. కొవిడ్‌  నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతోపాటు  పాజిటివ్‌ ఉన్నవారికి వైద్యం అందేలా తమవంతు సేవలు అందిస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు తమ ప్రాణాలను అడ్డుపెడుతున్నారు. ఏ క్షణమైనా కొవిడ్‌ సోకే ప్రమా దం ఉన్నా తగిన జాగ్రత్తలు తీసు కుంటూ ధైర్యంగా విధులు నిర్వహిసు ్తన్నారు. భూదాన్‌పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు ప్రధాన వైద్యాధికారులు, ముగ్గురు సూపరింటెం డెంట్లు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులు,  ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌,  16 ఎఎన్‌ఎంలు వైద్యసేవలు అందిస్తున్నారు. మండలవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో తొమ్మిది  సబ్‌ సెంటర్లు ఉన్నాయి.  ఈ సెంటర్ల పరిధిలో వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. వారి సేవలను పలువురు కొనియాడుతున్నారు. 

 జాగ్రత్తలు తీసుకుంటూ సేవలు అందిస్తున్నా

 జీవితంలో రిస్క్‌ ఉన్నప్పటికీ సేవ లు అందిస్తున్నా. ఎప్పటికప్పుడే చేతు లను శానిటైజ్‌ చేసుకుంటున్నా. కొవిడ్‌  విధుల నిర్వహణకు కుటుంబసభ్యుల  సహకారం ఎంతో ఉంది. అన్ని జాగ్రత్తలతో విధులు నిర్వహించమ ప్రోత్సహిస్తున్నారు. వైద్యాధికారులు, సిబ్బంది సహ కారంతో ఇలాంటి క్లిష్ట  పరిస్థితిలోనే వైద్యసేవలు అందించడం గర్వంగా ఉంది.

 రాపోలు లక్ష్మణ్‌, ఆరోగ్య కార్యకర్త, పోచంపల్లి పీహెచ్‌సీ 


పాజిటివ్‌ వచ్చివ వారికి ధైర్యం చెబుతున్నాం

ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా మాకు కేటాయించిన విధులను వందశాతం బాధ్యతగా చేస్తున్నాం. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సమయంలో పీపీఈ కిట్లు, కళ్లద్దాలు, గ్లౌజులు ధరించి మూడు, నాలుగు గంటలు ఉండాలి.  వేసవి కావడంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి ఒక్కరికీ కొవిడ్‌పై అవగా హన కల్పిస్తూ పాజిటివ్‌ వచ్చిన వారికి ధైర్యం చెబుతున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య సేవలు అందిచడం మా బాధ్యత.

పద్మావతి, ల్యాబ్‌ టెక్నీషియన్‌, పోచంపల్లి పీహెచ్‌సీ 

Updated Date - 2021-05-06T06:50:36+05:30 IST