Little boy singing Jana Gana Mana: ఆ కుర్రాడు జనగణమణ పాడుతున్న తీరుకు నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-08-16T23:34:38+05:30 IST

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరిగాయి.

Little boy singing Jana Gana Mana: ఆ కుర్రాడు జనగణమణ పాడుతున్న తీరుకు నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ దేశభక్తిని ఘనంగా చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక కుర్రాడు జనగణమన (Little boy sings Jana Gana Mana) పాడి నెటిజన్ల హృదయాలను దోచుకున్నాడు. ఆ చిన్న కుర్రాడు జాతీయ గీతాన్ని పాడుతున్న తీరు సోషల్ మీడియా జనాలను ఆకట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Video)గా మారింది.  


Vertigo Warrior అనే ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ అయిన ఆ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.  ఆ వీడియోలో ఓ చిన్న పిల్లాడు నోరు సరిగ్గా తిరగకపోయినా జన గణ మన పాడాడు. జాతీయ గీతం పాడుతూ ఆ బాలుడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఈ వీడియో కొద్ది సేపట్లోనే లక్ష వ్యూస్ సొంతం చేసుకుంది. ఆ బాలుడు పాడిన విధానంపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-16T23:34:38+05:30 IST