ఏడేళ్ల కుర్రాడికి కృతజ్ఙతలు తెలిపిన బ్రిటన్ రాణి.. కారణం ఏంటంటే!

ABN , First Publish Date - 2020-07-12T01:59:11+05:30 IST

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెడితే.. బ్రిటన్‌కు చెందిన ఏడేళ్ల కుర్రాడు మాత్రం.. బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 గురించి ఆలోచించాడు

ఏడేళ్ల కుర్రాడికి కృతజ్ఙతలు తెలిపిన బ్రిటన్ రాణి.. కారణం ఏంటంటే!

లండన్: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెడితే.. బ్రిటన్‌కు చెందిన ఏడేళ్ల కుర్రాడు మాత్రం.. బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 గురించి ఆలోచించాడు. ఆమె సంతోషం కోసం ఏకంగా ఓ ఫజిల్‌నే రూపొందించి ప్రస్తుతం నెటిజన్ల నుంచి ప్రశంసలు పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో మహమ్మారి బ్రిటన్‌ను కూడా కలవర పెట్టింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 నివసిస్తున్న బకింగ్ హాం ప్యాలస్‌లో కరోనా కలకలం సృష్టించింది. దీంతో రాణి ఎలిజబెత్-2.. లండన్‌లోని విండ్సర్ ప్లాజాకు చేరుకుని, స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏడేళ్ల తిమోతీ మాడర్స్.. బ్రిటన్ రాణి సంతోషం కోసం ఆలోచించాడు. ఒంటరిగా ఉన్నాననే భావన ఆమెలో కలగకూడదనే ఉద్దేశంతో ‘హ్యాపీనెస్ వర్డ్ సర్చ్’పేరుతో తిమోతీ మాడర్స్..  ఓ ఫజిల్‌ను రూపొందిచాడు. అంతేకాకుండా ఆ ఫజిల్‌ను పోస్ట్ ద్వారా రాణి ఎలిజబెత్-2కు పంపిచాడు. కాగా.. తిమోతీ మాడర్స్ పంపిన ఫజిల్‌పై బ్రిటన్ రాణి స్పందించారు. అంతేకాకుండా తన సంతోషం కోసం ఆలోచించిన ఆ ఏడేళ్ల కుర్రాడికి కృతజ్ఙతలు తెలుపుతూ.. ఆమె ఓ లేఖ రాశారు. అయితే బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 నుంచి లేఖ అందుకున్న తిమోతీ.. సంతోషం వ్యక్తం చేశాడు. ఏడేళ్ల కుర్రాడికి కృతజ్ఙతలు తెలుపుతూ బ్రిటన్ రాణి.. రాసిన లేఖ ఆన్‌లైన్ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. తిమోతీ మాడర్స్‌ను ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు. 


Updated Date - 2020-07-12T01:59:11+05:30 IST