లిట్టి

ABN , First Publish Date - 2021-07-31T18:42:56+05:30 IST

సత్తు పిండి - పావుకిలో, ఉల్లి విత్తనాలు - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, వాము - ఒక టీస్పూన్‌, మామిడికాయ పొడి - రెండు టీస్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, అల్లం - అంగుళం ముక్క,

లిట్టి

కావలసినవి: సత్తు పిండి - పావుకిలో, ఉల్లి విత్తనాలు - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, వాము - ఒక టీస్పూన్‌, మామిడికాయ పొడి - రెండు టీస్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, అల్లం - అంగుళం ముక్క, ఎండుమిర్చి - రెండు, ఆవాలనూనె - రెండు టేబుల్‌స్పూన్లు, గోధుమపిండి - ఒక కేజీ, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం: ఒక పాత్రలో ఉల్లివిత్తనాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వాము, మామిడికాయపొడి, దంచిన వెల్లుల్లి, అల్లం, వేగించిన ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. తరువాత అందులో ఆవాలనూనె, సత్తుపిండి వేసి కలియబెట్టి పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో గోధుమపిండి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. గోధుమపిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కాస్త వెడల్పుగా కప్పు ఆకారంలో ఒత్తుకోవాలి. మధ్యలో సత్తుపిండి మిశ్రమం పెట్టి చివరలు దగ్గరకు ఒత్తుకోవాలి. అరచేతులతో బాల్‌లా చేసుకోవాలి. ఇప్పుడు అప్పం పాత్ర(పనియారకల్‌, పొంగణాల ప్లేట్‌)లో కొద్దిగా నూనె వేసి లిట్టిలు పెట్టి ఉడికించాలి. ఏదైనా కర్రీతో లేదా చట్నీతో వేడివేడిగా తింటే ఇవి రుచిగా ఉంటాయి. 



Updated Date - 2021-07-31T18:42:56+05:30 IST