సాహితీవేత్త పీఎల్‌ శ్రీనివాసరెడ్డి కన్నుమూత

ABN , First Publish Date - 2021-10-23T05:38:31+05:30 IST

జిల్లాకు చెందిన సాహితీవేత్త, ఎస్కేయూ మాజీ ప్రొఫెసర్‌ పీఎల్‌ శ్రీనివాసరెడ్డి(72) శుక్రవారం ఉద యం 10 గంటల సమయంలో కన్నుమూశారు. కొం తకాలంగా గుండెకు సంబంధించి అనారోగ్యంతో బాఽ దపడుతున్నారు.

సాహితీవేత్త పీఎల్‌ శ్రీనివాసరెడ్డి కన్నుమూత
పీఎల్‌ శ్రీనివాసరెడ్డి (ఫైల్‌)

అనంతపురం టౌన/ అర్బన, అక్టోబరు 22: జిల్లాకు చెందిన సాహితీవేత్త, ఎస్కేయూ మాజీ ప్రొఫెసర్‌ పీఎల్‌ శ్రీనివాసరెడ్డి(72) శుక్రవారం ఉద యం 10 గంటల సమయంలో కన్నుమూశారు.  కొం తకాలంగా గుండెకు సంబంధించి అనారోగ్యంతో బాఽ దపడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మం డలం పార్లపల్లికి చెందిన ఆయన ఎస్కేయూలో లెక్చరర్‌గా చేరిన అనంతరం రీడర్‌గా, ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రభారతి శాఖాధ్యక్షుడిగా, రిజిస్ర్టారుగా సేవలందించారు. ఈయనకు భార్య దేవకి, కుమార్తె మనోజ్ఞ, కుమారుడు నారాయణస్వామి ఉన్నారు. ఈయన జన్మభూమికి వెళ్లనుగాక వెళ్లను, ‘స్వేదాశ్రువులు’ పద్య సంపుటి, ‘గోరంత దీపం’ కథాసంపుటి, మెరుపుతీగలు తదితర పుస్తకాలను వెలువరించారు. 


ప్రముఖుల దిగ్ర్భాంతి...

ఆచార్య పీఎల్‌ శ్రీనివాసరెడ్డి మృతిచెందారన్న విషయం తెలుసుకుని జిల్లాకు చెం దిన పలువురు రాజకీయ, సాహితీ ప్రముఖులు దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి, రెక్టార్‌ క్రిష్ణానాయక్‌, రిజిస్ర్టార్‌ క్రిష్ణకుమారి, ప్రిన్సిపాల్‌ శంకర్‌నాయక్‌, అనంతపురం అర్బన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన తోపుదుర్తి కవిత, సాహితీవేత్తలు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, శాంతినారాయణ, పతికి రమేష్‌నారాయణ, ఏలూరి యంగన్న తదితరులు శ్రీనివాసరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. అలాగే బాలల సంక్షేమ సమితి ఛైర్‌పర్సన నల్లాని రాజేశ్వరి, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథరెడ్డి, జిరసం ప్రతినిధులు ఉద్దండం చంద్రశేఖర్‌, గుత్తా హరిసర్వోత్తమనాయుడు, గుడిపల్లి విద్యావతి, సురేష్‌, జెన్నె ఆనంద్‌కుమార్‌, గోసల నారాయణస్వామి, కోటిగారి వన్నప్ప, గంగిరెడ్డి అశ్వర్థరెడ్డి, టీవీ రెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-10-23T05:38:31+05:30 IST