వెల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌

ABN , First Publish Date - 2021-02-26T20:31:50+05:30 IST

ప్రముఖ కవి వెల్చేరు నారాయణరావుకు అత్యున్నత గౌరవం లభించింది. కేంద్ర

వెల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌

అమరావతి: ప్రముఖ కవి వెల్చేరు నారాయణరావుకు అత్యున్నత గౌరవం లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌కు నారాయణరావును ఎంపిక చేశారు. తెలుగులో అనేక రచనలు, అనువాదాలు నారాయణరావు చేశారు. ఇప్పటి వరకు సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపికైన వారిలో 14వ కవి నారాయణరావు. 


 వెల్చేరు నారాయణరావు ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు. బ్రిటీష్ యుగంలో భారతీయ సాహిత్యం, ముఖ్యంగా పాశ్చాత్య సాహిత్య పరిశోధన వల్ల  తెలుగు సాహిత్యం ఎలాంటి ప్రభావాలకు లోనైందో పరిశోధించారు. సమగ్రమైన అధ్యయనంతో ఆ లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్న విశిష్ట పరిశోధకుడు. నారాయణరావు చేసిన కృషికి అంతర్జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు, గౌరవాలు ఆయనను వరించాయి.


కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ తాను గుర్తించిన భారతీయ భాషల్లో సాహిత్యం సేవ చేసిన వారికి ఈ ఫెలోషిఫ్‌ను అందజేస్తోంది.  ప్రతీ ఏటా భారతీయ భాషల్లో రచనలు చేసిన వారికి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు.


శ్రీ కాళహస్తీశ్వర శతకం, బసవ పురాణం, క్రీడాభిరామం , కళాపూర్ణోదయం, కాళిదాసు, తదితర రచనలను అనువదించారు. క్షేత్రయ్య, అన్నమయ్య సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. 


విశ్వనాథ సత్యనారాయణ నవలలు "హాహాహూహూ"ను అదే పేరుతో , "వీరవల్లడు"ను "వల్లడు ద హీరో" పేరిట  అనువాదం చేశారు. నగ్నముని కొయ్యగుర్రం కవిత్వాన్ని "వుడెన్ హార్స్" పేరిట ఆంగ్లానువాదం. స్త్రీల పాటయిన "ఊర్మిళాదేవి నిద్ర"ను "ఊర్మిళా స్లీప్స్" పేరిట ఆంగ్లానువాదం.

జానపద గీతాలు సీతగడియను "సీతా లాక్డ్ అవుట్"గా, లక్ష్మణదేవర నవ్వును "లక్ష్మణా లాఫ్స్"గా అనవాదం చేశారు.  తెలుగులో ఎన్నుకున్న కొన్ని కవితలను కలిపి "ఎ సెలక్షన్ ఆఫ్ మోడ్రన్ తెలుగు పొయెట్రీ"గా  ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. 


నారాయణరావు పలు పరిశోధక గ్రంథాలు, ప్రామాణిక అధ్యయనాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని అందజేసి ఆయా రచనలను సుసంపన్నం చేశాడు. తెలుగు సాహిత్యంలోని వివిధ అంశాలకు చరిత్ర, ఆంత్రోపాలజీ తదితర రంగాల అంశాలతో ముడిపెట్టి తులనాత్మక అధ్యయనం చేసి వెలువరించారు. 

  1965, చిన్న కథలు, గీతా బుక్ హౌస్, ఏలూరు, తదితర కథలను రాశారు. తన తొలి విమర్శా గ్రంథమైన "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం"లో కవిత్వంలోని విప్లవాల గురించి ఆయన వివరించాడు. 1933, ఫిబ్రవరి 1న ఆయన ఏలూరులో జన్మించారు. 

Updated Date - 2021-02-26T20:31:50+05:30 IST