మేడం మొర వినండి

ABN , First Publish Date - 2022-08-07T06:10:45+05:30 IST

రాష్ట్రంలో ఉన్న ఏకైక ట్రిపుల్‌ ఐటీ (ఆర్జీయూకేటీ) సమస్యలకు నిలయంగా మారింది.

మేడం మొర వినండి

ట్రిపుల్‌ ఐటీలో సమస్యల తిష్ఠ

ప్రారంభం నుంచే సమస్యలతో పోరాటం

నిధుల కొరత.. సిబ్బంది కొరత

లోపభూయిష్టమైన పరిపాలనా విధానం

దశాబ్ద కాలంగా విద్యార్థుల ఆకలి కేకలు

లోపించిన పారదర్శకతతో అయోమయం

ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

బాసర, ఆగస్టు 6 : రాష్ట్రంలో ఉన్న ఏకైక ట్రిపుల్‌ ఐటీ (ఆర్జీయూకేటీ) సమస్యలకు నిలయంగా మారింది. దశాబ్దం క్రితం ఐఐటీ కందికి తరలిపోవడంతో బాసరకు ట్రిపుల్‌ఐటీ దక్కింది. ఏర్పాటు సమయంలోనే కేటాయింపులో వివక్షకు భీజం పడింది. నిధులు, సిబ్బంది నియామకం విషయంలో ఇక్కడి ట్రిపుల్‌ ఐటీకి భారీగానే నష్టపోయింది.  రాష్ట్ర విభజన అనంతరం  తెలంగాణ రాష్ర్టానికి ఒకే ఒక్క ట్రిపుల్‌ ఐటీ దక్కింది. ఇందులో వసతి, చదువు, భోజన ఇలా ప్రతీ విషయంలో ఇబ్బందులు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఉండడానికి సరైన వసతులు లేవు. చదువు కోవడానికి అధ్యాపకులు లేరు, పుస్తకాలు ఇవ్వడం లేదు. తినడానికి సరియైున భోజనం పెట్టడం లేదు. అనారో గ్యానికి గురైతే విద్యార్థులు ఇంటికెళ్లాల్సిన దుస్థితి. ము ఖ్యంగా రెగ్యూలర్‌గా ఒక ఉన్నతాధికారి లేరు. ల్యాప్‌ట్యాప్‌లు అందవు. అన్నింట్లోనూ జాప్యమే. చివరకు ఈ పరిస్థితులను చూసి న్యాక్‌ ‘సి’ గ్రేడ్‌ ఇచ్చింది. ఇలా చెప్పు కుంటూ పోతే ట్రిపుల్‌ ఐటీలో సమస్యల చిట్టా పెద్దదిగానే అవుతోంది. ఇటీవలే అన్ని యూనివర్సిటీల విద్యార్థులతో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఇక్కడున్న సమస్యల గురించి మొరపెట్టు కున్నారు. తమ క్యాంపస్‌కు రావాలని, మా బాధలు తీర్చాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ ఐటీ సందర్శనకు వస్తున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పర్యటన పురస్కరించుకొని ట్రిపుల్‌ ఐటీలో నెలకొన్న పరిస్థితులపై ఆంధ్రజ్యోతి కథనం.. 

ఎనిమిదేళ్లుగా రెగ్యూలర్‌ వీసీకి లభించని మోక్షం.. 

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ట్రిపుల్‌ ఐటీకి రెగ్యూలర్‌ వీసీ దిక్కులేదు. ఇన్‌చార్జి వీసీలతోనే నెట్టుకొట్టుస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మారిన అందరూ ఇన్‌చార్జి బాధ్యతలతోనే మార్పులు జరిగాయి. అసలు ఈ ఎనిమిదేళ్ల కాలంలో మిగతా యూనివర్సిటీలకు రెండుసార్లు వీసీల నియామకం జరిగిన ప్పటికీ ఇక్కడ మాత్రం కనీసం నియామకానికి ప్రక్రియ కూడా చేపట్టలేదు. రెగ్యూలర్‌ అధికారి లేకపోవడంతో బాసర ట్రిపుల్‌ ఐటీకి పెద్దదిక్కు లేకుండా పోయింది. రెగ్యూలర్‌ వీసీతో పాటు డైరెక్టర్‌, పరిపాలన అధికారి ఇతర ఉన్నతాధికారులను నియమించాల్సిన అవసరం ఉంది. 

తగ్గిపోయిన నిధుల కేటాయింపు.. 

తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి బాసర ట్రిపుల్‌ ఐటీకి నిధుల కేటాయింపు ప్రతీ ఏడాది తగ్గిపోతూ వస్తోంది. 2014 లో రూ. 119 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది కేవలం రూ.29 కోట్లు మాత్రమే ప్రభుత్వం తమ బడ్జెట్‌లో నిధులను కేటాయించింది. కేటాయింపులే కాదు.. విడుదల చేసే నిధుల విషయంలో కూడా బాసర ట్రిపుల్‌ ఐటీపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గడిచిన ఎనిమిదేళ్లలో ట్రిపుల్‌ఐటీ అధికారులు రూ.1161 కోట్లు ప్రతిపాదనలు పంపిస్తే అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.430 కోట్లు కేటాయించగా తగ్గించి కేవలం రూ.294 కోట్లు నిధులు మాత్రమే వి డుదల చేసింది. ఇలా ప్రతీ సంవత్సరం ట్రిపుల్‌ ఐటీకి రాష్ట్ర ప్రభుత్వం నిధుల విషయంలో కోతలు పెడుతుండడంతో ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులకు సమస్యల పెరిగిపోయాయి. ఒకవైపు ధరలు పెరిగిపోతుంటే.. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధుల రాక తగ్గిపోయింద. ఇ దీంతో పరిపాలన నిర్వహణ అదుపుతప్పింది. ప్రభుత్వం నుంచి అధికారుల అంచనాల మేరకు నిధులను విడుదల చేస్తే తప్ప ట్రిపుల్‌ ఐటీ మెరుగుపడే పరిస్థితి లేదు.

మరికొన్ని ప్రధాన సమస్యలు 

ఫ ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులకు అనుగుణంగా సరైన నిష్పత్తిలో అధ్యాపకులు లేరు, దాదాపు 125 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొరత కారణంగా హడా వుడిగా సిలబస్‌ను పూర్తి చేయడంతో విద్యార్థులు సరిగా చదుకోని పరిస్థితి ఎదురవుతుంది. 

ఫ మూడేళ్ల నుంచి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందడం లేదు. దాదాపు రూ. 100 కోట్లు విడుదలకు పెండింగ్‌లో ఉన్నాయి. 

ఫ మెస్‌ కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. నాసిరక భోజనంతో తరచూ విద్యార్థులకు అ స్వస్థతకు గురవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 

ఫ ఆటలపోటీల ఊసే లేదు.. ఇతర విద్యార్థుల సృజనాత్మతను పెంపొందించే అంశాలను ప్రోత్సహించేందుకు సరైన సౌకర్యాలు, నిధులు, సిబ్బంది లేవనే ఆరోపణ

ఫ వసతిగృహాల్లో పడకలు, బెడ్‌లు ఇతర వసతులు ఏర్పాటు చేయాలి. కనీసం ఫ్యాన్‌ సౌకర్యం లేదు. స్వచ్ఛమైన తాగునీరు దొరికే పరిస్థితి లేదు.

ఫ ట్రిపుల్‌ ఐటీలో ఉన్న ఆస్పత్రిలో వైద్యసేవలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సమస్య వచ్చిందం టే దూర ప్రాంతంలోని ఆసుపత్రులకు పరిగెత్తాల్సిందే.

ఫ గత మూడేళ్ల నుంచి యూనిపామ్స్‌, ల్యాప్‌టాప్‌లు అందడం లేదు. 

ఫ విద్యార్థులు ఇప్పటికీ సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయాందోళనకు గురవుతున్నారు. 

నేడు బాసరకు గవర్నర్‌ తమిళిసై.

బాసర, ఆగస్టు 6 : రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఆది వారం బాసరలో పర్యటించనున్నారు. ప్రత్యేక రైలులో నిజామాబాద్‌కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆదివారం ఉదయం 4 గంటలకు బాసరకు రాను న్నారు. ట్రిపుల్‌ ఐటీలో బసచేసి ఉదయం 6.30 గంటలకు సరస్వతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మళ్లీ యూనివర్సిటీకి వెళ్లి ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో అల్పాహారం చేయనున్నారు. విద్యార్థులు, అధ్యాపకులతో 10 గంటలకు ముఖాముఖిలో పాల్గొని నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూని వర్సిటీకి బయలుదేరనున్నారు. 

Updated Date - 2022-08-07T06:10:45+05:30 IST