నవంబర్, డిసెంబర్ నెలల్లో OTT లో విడుదల కాబోయే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సీరీస్‌ల లిస్ట్ ఇదీ.. భారీగా అంచనాలు..!

ఆడియన్స్‌లో కొందరు ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడితే.. మరికొందరు యాక్షన్ థ్రిల్లర్స్‌ని లైక్ చేస్తారు. అయితే అందరూ ఇష్టపడే జానర్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్. సీట్ ఏడ్జ్ మీది కూర్చోబెట్టే అలాంటి సినిమాలు, సిరీస్‌లు అంటే మీకు ఇష్టమేనా? అయితే కచ్చితంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో OTT లో విడుదల కాబోయే వీటిని మిస్వవకుండా చూసేయాల్సిందే.


స్పెషల్ అప్స్ 1.5

సస్పెండ్ అయిన ఓ అధికారి నుంచి ‘రా’ ఏజెంట్ అయ్యే వరకు సాగిన హిమ్మత్ సింగ్ అనే వ్యక్తి ప్రయాణమే ఈ వెబ్ సిరీస్. ప్రధాన పాత్రలో కే కే మీనన్ నటించగా.. అఫ్తాబ్ శివదాసాని, ఐశ్వర్య సుస్మిత, ఆదిల్ ఖాన్, వినయ్ పాథక్, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ నవంబర్ 12న డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలకానుంది.


ది హాక్‌‘ఐ’

మార్వెల్ మూవీస్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. మార్వెల్ కామిక్ యూనివర్స్ పేరుతో ‘అవెంజర్స్’ సిరీస్‌లో ఇప్పటికే 25కి పైగా చిత్రాలను నిర్మించి ఈ సంస్థ నుంచి  రాబోతున్న మరో సూపర్ హీరో వెబ్ సిరీస్ ‘ది హాక్‌ఐ’. జెరెమీ రెన్నర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ నవంబర్ 24 డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.


ధమాకా..

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన చిత్రం ‘ధమాకా’. 2013లో వచ్చిన సౌత్ కొరియన్ చిత్రం ‘ది టెర్రర్ లైవ్‌’కి ఇది రీమేక్. ఒక మాజీ టీవీ న్యూస్ యాంకర్ తిరిగి వచ్చే అవకాశం వస్తుంది. కానీ, అతని చేసే రేడియో షోకి వచ్చిన ఓ భయంకరమైన కాల్ అతని జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. నవంబర్ 19న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌‌లో విడుదల కానుంది.


‘మనీ హెయిస్ట్’ సీజన్ 5..

ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ చూరగొన్న స్పానిష్ వెబ్‌సిరీస్ ‘మనీ హెయిస్ట్’. నేషనల్ మింట్‌లో డబ్బులు ప్రింట్ చేయడం, నేషనల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి బంగారాన్ని కొల్లగొట్టడం అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్‌కి ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. ఆ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు సిజన్లు, ఐదో సీజన్‌లో మొదటి వ్యాల్యూమ్ విడుదల కాగా.. చివరిదైన రెండో వ్యాల్యూమ్ డిసెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకానుంది.


రెడ్ నోటీసు..

‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడోట్, ‘డెడ్ పూల్’ ఫేమ్ ర్యాన్ రేనాల్డ్స్, ‘జుమాంజీ’ ఫేమ్ డ్వేన్ నటించిన తాజా చిత్రం ‘రెడ్ నోటీసు’. ప్రపంచంలోని అత్యుత్తమ దొంగ, ఇంటర్‌పోల్ ఆఫీసర్ మధ్య సాగే పోరాటమే ఈ చిత్రం కథాంశం. నవంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌తో విడుదల కానుంది.


Advertisement
Advertisement