Maharashtra crisis: క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు వీరే..

ABN , First Publish Date - 2022-06-21T19:24:09+05:30 IST

శ్రీనివాస్ చింతమన్, ఏక్‌నాథ్ సంభాజి, మహేష్ సంభాజి రాజె, సందీపన్వర్ ఆశారాం, సంతారం తుకారం, డాక్టర్ సంజయ్ భాస్కర్రావ్, విశ్వనాథ్ ఆత్మారం, అనిక్ కజేరా, రమేష్ నానాసాహేబ్, షహాజి బాపు, కిషోర్ ఆప్పా, చిన్మన్‌రావ్ రూప్‌చంద్, మహేంద్ర హరి, ప్రదీప్ శివనారాయణ, షంభూరాజ్ శివాజీరాజ్, షేన్‌రాజ్ గోదిరామ్..

Maharashtra crisis: క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలు వీరే..

ముంబై: మహారాష్ట్ర(Maharastra)లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) 21 మంది ఎమ్మెల్యేలను(మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు) వెంటబెట్టుకుని గుజరాత్‌(Gujarath)కు మకాం మార్చారు. సూరత్‌ నగరంలోని మెరీడియన్  హోటల్‌లో క్యాంప్ ఏర్పాటు చేశారు. వీరిలో ఐదుగురు మంత్రులు ఉన్నారు. ఏక్‌నాథ్ షిండేతోపాటు మిగతా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్లు కలవడంలేదని సమాచారం. దీంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే(Uddav Thackerey) ప్రభుత్వంలో అలజడి మొదలైంది.


కాగా, గుజరాత్‌లోని సూరత్‌కు మకాం మార్చిన ఎమ్మెల్యేలు వీరేనంటూ కొంత మందితో కూడిన ఒక లిస్ట్ మీడియాలో ప్రచారం అవుతోంది. వారి పేర్లు వరుసగా.. శ్రీనివాస్ చింతమన్, ఏక్‌నాథ్ సంభాజి, మహేష్ సంభాజి రాజె, సందీపన్వర్ ఆశారాం, సంతారం తుకారం, డాక్టర్ సంజయ్ భాస్కర్రావ్, విశ్వనాథ్ ఆత్మారం, అనిక్ కజేరా, రమేష్ నానాసాహేబ్, షహాజి బాపు, కిషోర్ ఆప్పా, చిన్మన్‌రావ్ రూప్‌చంద్, మహేంద్ర హరి, ప్రదీప్ శివనారాయణ, షంభూరాజ్ శివాజీరాజ్, షేన్‌రాజ్ గోదిరామ్, డాక్టర్ బాలాజీ ప్రహలాద్, బ్రత్షేత్ మారుతి, సంజయ్ రంభవ్, సుహాస్ ద్వారక్‌నాథ్, ప్రకాష్ ఆనంద్‌రావ్, రాజ్‌కుమార్ పటేల్. అయితే ఇందులో రాజ్‌కుమార్ పటేల్ స్వతంత్ర ఎమ్మెల్యే.



Updated Date - 2022-06-21T19:24:09+05:30 IST