Abn logo
Jun 1 2020 @ 09:14AM

బీరుబాటిళ్ల లారీ బోల్తా.. ఎత్తుకెళ్లిన వాహనదారులు

Kaakateeya

రంగారెడ్డి/కీసర : బీరు బాటిళ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బడంగ్‌పేట్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ మాజీద్‌ (34) మేడల్‌జిల్లా కీసర మండల పరిధిలోని భోగారం లిక్కర్‌ గోదాంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి లారీలో బీరు బాటిళ్ల లోడుతో సంగారెడ్డి జిల్లా నుంచి భోగారంకు వస్తున్నాడు.


ఈ క్రమంలో కీసర మండల పరిధి తిమ్మాయిపల్లి గ్రామసరిహద్దులోకి రాగానే లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో డ్రైవర్‌ మాజీద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఆదివారం తెల్లవారుజామున వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా పడిన బీరుబాటిళ్లను అందిన కాడికి ఎత్తుకెళ్లిపోయారు. పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి డ్రైవర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement