‘దుర్గగుడి సభ్యురాలి’ కారులో అక్రమ మద్యం!

ABN , First Publish Date - 2020-10-01T07:09:16+05:30 IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద పార్క్‌ చేసిన కారులో నుంచి రూ.40 వేల విలువ చేసే 283 మద్యం సీసాలను స్పెషల్‌ బ్రాంచి పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు...

‘దుర్గగుడి సభ్యురాలి’ కారులో అక్రమ మద్యం!

  • ఆమె భర్త, డ్రైవర్‌పై కేసు  


జగ్గయ్యపేట, సెప్టెంబరు 30: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద పార్క్‌ చేసిన కారులో నుంచి రూ.40 వేల విలువ చేసే 283 మద్యం సీసాలను స్పెషల్‌ బ్రాంచి పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు చుక్కా నాగ వెంకట వరలక్ష్మికి చెందినదిగా గుర్తించారు. తెలంగాణ నుంచి కారులో మద్యం తీసుకువచ్చి పార్కింగ్‌ చేసిన కొద్దిసేపటికే పోలీసులు పట్టుకున్నారు. వరలక్ష్మి భర్త ప్రసాద్‌తోపాటు, కారు డ్రైవర్‌ ఎస్‌.శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2020-10-01T07:09:16+05:30 IST