Abn logo
Apr 17 2021 @ 00:37AM

తెలంగాణ మద్యం, నాటుసారా స్వాధీనం

ముసునూరు. ఏప్రిల్‌ 16: మండల పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు చేసిన దాడుల్లో తెలంగాణ మద్యం, నాటుసారాను స్వాధీనం చేసుకుని, ఒక మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ముసునూరుకు చెందిన అనగాని సీతామహాలక్ష్మి అనధికార మద్యం విక్రయాలు చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఆమె ఇంటిలో తనిఖీలు చేశామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  బ్యూరో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.సాయిస్వరూప్‌ తెలిపారు. తెలంగాణ మద్యం 125 సీసాలు, 25 లీటర్ల నాటుసారా దొరికిందన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని, సీతామహాలక్ష్మిని ఆరెస్టు చేసినట్లు సాయిస్వరూప్‌ తెలిపారు. 

200 బాటిళ్లు స్వాధీనం

తిరువూరు: మండలంలోని అక్కపాలెం బోర్డర్‌ చెక్‌పోస్టు వద్ద తెలంగాణ నుంచి తెస్తున్న 200 మద్యం బాటిళ్లను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు వైపు నుంచి ద్విచక్రవాహనంపై మద్యం బాటిళ్లను నూజివీడుకు తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి బైక్‌, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు, పట్టుబడిన ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు.


Advertisement
Advertisement
Advertisement