Abn logo
Sep 19 2021 @ 00:25AM

నేడు 39 మండలాల్లో మద్యం విక్రయాలు బంద్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో ఆదివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండడంతో 39 మండలాల్లో  మద్యం విక్రయాలను నిషేధిస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఉదయం నుంచి ఫలితాలు వెల్లడయ్యే వరకు మద్యం దుకాణాలు, బార్‌లు మూసివేయాలని, ఎక్కడా మద్యం విక్రయాలు జరపకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఎవరనా ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.