Kuwait లో పోర్టులో కంటైనర్‌ను తనిఖీ చేసిన పోలీసులు.. అనుమానంగానే డోర్లు ఓపెన్ చేసి చూస్తే ఏం మాత్రలు లభించాయంటే..

ABN , First Publish Date - 2022-10-05T02:56:47+05:30 IST

కువైట్‌లోని పోర్టులో ఓ కంటైనర్‌ను చెక్ చేసిన పోలీసులకు భారీ షాక్ తగిలింది. ఆ కంటైనర్‌లో ఏకంగా 2 మిలియన్ల లైరికా టాబ్లెట్లు, 7474 లిక్కర్ బాటిళ్లు తరలిస్తున్నట్టు తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోయారు.

Kuwait లో పోర్టులో కంటైనర్‌ను తనిఖీ చేసిన పోలీసులు.. అనుమానంగానే డోర్లు ఓపెన్ చేసి చూస్తే ఏం మాత్రలు లభించాయంటే..

ఎన్నారై డెస్క్: కువైట్‌లోని పోర్టులో ఓ కంటైనర్‌ను చెక్ చేసిన పోలీసులకు భారీ షాక్ తగిలింది. ఆ కంటైనర్‌లో ఏకంగా 2 మిలియన్ల లైరికా టాబ్లెట్లు, 7474 లిక్కర్ బాటిళ్లు తరలిస్తున్నట్టు తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ నిషేధిత వస్తువులను జప్తు చేసిన అనంతరం పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో ఈ అక్రమరవాణా ఉదంతం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. కంటైనర్‌లో ఎవరికీ కనబడకుండా ఉన్న ఓ భాగంలో వీటిని దాచి ఉంచిన వైనాన్ని వారు గుర్తించారు. నిషేధిత వస్తువులు, మద్యాన్ని తరలించేవారికి కఠిన శిక్షలు అమలవుతాయని స్పష్టం చేశారు. 


Updated Date - 2022-10-05T02:56:47+05:30 IST