భారీ స్థాయిలో మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-06-23T05:40:36+05:30 IST

నరసరావుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) సూపరింటెండెంట్‌ వి.చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది, పిడుగురాళ్ళ బోర్డర్‌ మొబైల్‌ సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున నరసరావుపేట శివారుల్లో సుమారు రూ.10 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు.

భారీ స్థాయిలో మద్యం పట్టివేత
స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు, లారీ నిందితులతో సెబ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖరరెడ్డి, సిబ్బంది

ూ.17 లక్షల విలువైన సొత్తు స్వాధీనం 


నరసరావుపేట లీగల్‌, జూన్‌ 22: నరసరావుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) సూపరింటెండెంట్‌ వి.చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేట స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది, పిడుగురాళ్ళ బోర్డర్‌ మొబైల్‌ సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున నరసరావుపేట శివారుల్లో సుమారు రూ.10 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి... విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ నుంచి పట్టణానికి వస్తున్న మద్యాన్ని మంగళవారం తెల్లవారుజామున పట్టకున్నారు. పట్టణంలోని రామిరెడ్డిపేటకు చెందిన నందిగం రాజశేఖర్‌, కొత్త సత్యనారాయణలను అరెస్టు చేశారు. రూ.5 లక్షల విలువైన లారీని, మద్యాన్ని దాచి  పైన ఉంచిన రూ.2 లక్షలు విలువైన 400 సిమెంట్‌ బస్తాలను, 3,792 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం సొత్తు విలువ సుమారు రూ.17 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులైన కొత్త రవిచంద్ర, తెలంగాణకు చెందిన సతీష్‌లను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. కాగా కొత్త రవిచంద్రపై ఈ ఏడాది ఏప్రిల్‌లో భారీస్థాయిలో మద్యాన్ని తరలిస్తున్న కేసులో అరెస్టు చేసినట్టు, బెయిల్‌పై విడుదలై మళ్లీ ఈ అకృత్యానికి పాల్పడినట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-06-23T05:40:36+05:30 IST