స్పెన్సర్స్‌తో ఫ్లిప్‌కార్ట్‌ జట్టు

ABN , First Publish Date - 2020-04-10T06:58:14+05:30 IST

ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. రిటైల్‌ చెయిన్‌ స్టోర్‌ స్పెన్సర్స్‌తో జట్టుకట్టింది. ఇందులో భాగంగా నిత్యావసర సరుకులను ..

స్పెన్సర్స్‌తో ఫ్లిప్‌కార్ట్‌ జట్టు

హైదరాబాద్‌: ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. రిటైల్‌ చెయిన్‌ స్టోర్‌ స్పెన్సర్స్‌తో జట్టుకట్టింది. ఇందులో భాగంగా నిత్యావసర సరుకులను హైదరాబాద్‌లో కస్టమర్ల ఇంటికే డెలివరీ చేయనుంది. ప్రయోగాత్మకంగా నగరంలో ఈ సేవలను ప్రారంభిస్తోంది. రెండు సంస్థల ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ మూలంగా వేగవంతంగా, సురక్షితంగా కస్టమర్లకు సరుకులను డెలివరీ చేసే అవకాశం ఉందని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు.  


టారిఫ్‌ రేట్లు తగ్గించిన బ్లూడార్ట్‌

ఎక్స్‌ప్రెస్‌ లాజిస్టిక్స్‌ సర్వీసులు అందిస్తున్న బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌.. రిటైల్‌ టారిఫ్‌ ధరలను 25 శాతం మేర తగ్గించింది. భారత్‌ కరోనా సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-04-10T06:58:14+05:30 IST