విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

ABN , First Publish Date - 2021-04-17T05:22:38+05:30 IST

విద్యకు పేదరికం శాపంగా మారకుండా విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సుప్రీమ్‌ ప్రతినిధులు శంకర్‌గుప్తా, పెనుమత్స అప్పలరాజు పిలుపునిచ్చారు.

విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేస్తున్న లయన్స్‌ సుప్రీమ్‌ ప్రతినిధులు శంకర్‌గుప్తా, అప్పలరాజు, ఉపాధ్యాయులు

విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సుప్రీమ్‌ ప్రతినిధులు 

అజిత్‌సింగ్‌నగర్‌, ఏప్రిల్‌ 16: విద్యకు పేదరికం శాపంగా మారకుండా విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సుప్రీమ్‌ ప్రతినిధులు శంకర్‌గుప్తా, పెనుమత్స అప్పలరాజు పిలుపునిచ్చారు. అజిత్‌సింగ్‌నగర్‌ వివేకానంద పాఠశాలలో క్లబ్‌ ఆధ్వర్యాన శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల ీఫజులు కట్టలేక ఇబ్బందిపడుతున్న పూర్వ విద్యార్థికి ఏడాదికి రూ. 20 వేలు, పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, వృద్ధులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ వివేకానందుడి పేరుపై ఉన్న అజిత్‌సింగ్‌నగర్‌ వివేకానంద సెంటినరీ స్కూల్లో  విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుని, సమాజానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రధానోపాధ్యాయులు రమణారావు, మాధవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:22:38+05:30 IST