మారడోనాకు నివాళి! మెస్సీకి జరిమానా

ABN , First Publish Date - 2020-12-04T09:08:47+05:30 IST

సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా మృతికి నివాళులర్పించిన అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీపై జరిమానా విధించారు. స్పానిష్‌ లీగ్‌లో ఒసాసునాతో మ్యాచ్‌లో బార్సిలోనా తరఫున గోల్‌ చేసిన మెస్సీ.. తన జెర్సీని తీసేసి న్యూవెల్స్‌ ఓల్డ్‌ బాయ్స్‌కు మారడోనా ఆడినప్పుడు వేసుకున్న జెర్సీని ప్రదర్శించడంతోపాటు ఆకాశానికేసి చూస్తూ శ్రద్ధాంజలి ఘటించాడు...

మారడోనాకు నివాళి! మెస్సీకి జరిమానా

బార్సిలోనా (స్పెయిన్‌): సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా మృతికి నివాళులర్పించిన అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనెల్‌ మెస్సీపై జరిమానా విధించారు. స్పానిష్‌ లీగ్‌లో ఒసాసునాతో మ్యాచ్‌లో బార్సిలోనా తరఫున గోల్‌ చేసిన మెస్సీ.. తన జెర్సీని తీసేసి న్యూవెల్స్‌ ఓల్డ్‌ బాయ్స్‌కు మారడోనా ఆడినప్పుడు వేసుకున్న జెర్సీని ప్రదర్శించడంతోపాటు ఆకాశానికేసి చూస్తూ శ్రద్ధాంజలి ఘటించాడు. ఆట ముగిసిన తర్వాత మారడోనాతో ఉన్న ఫొటోను మెస్సీ పోస్టు చేశాడు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా జెర్సీని తీసివేయడంపై టోర్నీ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి రూ.53 వేల జరిమాన విధించారు. బార్సిలోనా క్లబ్‌నకు కూడా రూ. 15 వేలు ఫైన్‌ వేశారు.

Updated Date - 2020-12-04T09:08:47+05:30 IST