అగ్రరాజ్యం Americaలో పాఠశాలను విజిట్ చేసిన అనుకోని అతిథి.. క్లాస్‌రూమ్‌లో దాన్ని చూసి సిబ్బంది షాక్!

ABN , First Publish Date - 2022-06-05T21:21:24+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో అనుకోని అతిథి అందరి కంటే ముందే క్లాస్‌రూంలోకి ప్రవేశించి.. విద్యార్థులు, ఉపాధ్యాలయులతోపాటు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆ ప్రత్యేక అతిథికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ ఉదయాన్నే పాఠశాలను

అగ్రరాజ్యం Americaలో పాఠశాలను విజిట్ చేసిన అనుకోని అతిథి.. క్లాస్‌రూమ్‌లో దాన్ని చూసి సిబ్బంది షాక్!

ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో అనుకోని అతిథి అందరి కంటే ముందే క్లాస్‌రూంలోకి ప్రవేశించి.. విద్యార్థులు, ఉపాధ్యాలయులతోపాటు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆ ప్రత్యేక అతిథికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ ఉదయాన్నే పాఠశాలను విజిట్ చేసిన ఆ ప్రత్యేక అతిథి ఎవరు? అనే కదా మీ సందేహం. అయితే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. 


కాలిఫోర్నియాలో ఉన్న పెస్కాడెరో హైస్కూల్ సిబ్బంది.. ఎప్పటిలాగే పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి ఉదయాన్నే వెళ్లారు. ఇందులో భాగంగానే.. ఇంగ్లీష్ క్లాస్‌రూమ్‌కు వెళ్లారు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. క్లాస్‌రూంలో ఉన్న సింహం పిల్లను చూసి కంగుతిన్న అధికారులు.. వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో.. రెస్క్యూటీం అక్కడకు చేరుకుని.. సింహం పిల్లను బంధించి అక్కడ నుంచి తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. 4-6 నెలల వయసు ఉన్న ఆ సింహం పిల్లను ఓక్ ల్యాండ్‌లోని జూకి తరలించనున్నట్టు పేర్కొన్నారు. 



అంతేకాకుండా అది ఎవరిపై దాడి చేయలేదని.. ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదని వెల్లడించారు. అంతేకాకుండా.. ఈ సంఘటన ఆధారంగా పిల్లల తల్లిదండ్రులకు అధికారులు కీలక సూచనలు చేశారు. అడవి జంతువుల సంచారం ఉండే ప్రదేశంలో నివసిస్తున్నందువల్ల అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని పిల్లలకు చెప్పాలని తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. అధికారుల పని తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 


Updated Date - 2022-06-05T21:21:24+05:30 IST