Viral Video: శునకాన్ని ఆప్యాయంగా ముద్దాడిన సింహం!

ABN , First Publish Date - 2022-01-08T23:52:05+05:30 IST

శునకం, సింహానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదిచూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అడవికి రాజుగా భావించే సింహం.. ఇలా చేసిందేంటి అంటూ కా

Viral Video: శునకాన్ని ఆప్యాయంగా ముద్దాడిన సింహం!

ఇంటర్నెట్ డెస్క్: శునకం, సింహానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదిచూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అడవికి రాజుగా భావించే సింహం.. ఇలా చేసిందేంటి అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళతే.. 


డాగ్‌లవర్ అనే ఇన్‌స్ట్రాగ్రాం పేజీలో సింహం, శునకానికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తాజాగా పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రకారం.. తన దగ్గరకు వచ్చిన కుక్కను సింహం ఆప్యాయంగా ముద్దుపెట్టుకుంటుంది. ఆ తర్వాత శునకం వెనుదిరగగానే.. సింహం కూడా దాని వెనకాలే పరుగులు తీసిన దృశ్యాలను ఆ వీడియోలో గమనించవచ్చు. శునకం, సింహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అవి రెండూ జాతి బేధాన్ని మర్చిపోయి.. స్నేహంగా ఉండటంపట్ల కొందరు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరికొందరేమో సింహం.. శునకాన్ని ముద్దాడటం ఏంటి? అంటూ కామెంట్లు చెస్తున్నారు. కాగా.. ఈ శునకం, సింహం రెండూ కూడా చిన్నప్పటి నుంచే కలిసే పెరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అవి స్నేహంగా మెలుగుతున్నట్టు సమాచారం. 






Updated Date - 2022-01-08T23:52:05+05:30 IST