Viral Video: అడవిలో నుంచి జనావాసం లోకి వచ్చిన సింహం.. జాగింగ్ చేస్తున్న మహిళను చూసి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-10-01T00:41:20+05:30 IST

అడవులను నరికేయడంతో వన్య మృగాలు ఆవాసాలు కోల్పోతున్నాయి. తినడానికి ఆహారం లేక, ఉండడానికి గూడు లేక జనవాసాల వైపు వచ్చేస్తున్నాయి.

Viral Video: అడవిలో నుంచి జనావాసం లోకి వచ్చిన సింహం.. జాగింగ్ చేస్తున్న మహిళను చూసి ఏం చేసిందంటే..

అడవులను నరికేయడంతో వన్య మృగాలు ఆవాసాలు కోల్పోతున్నాయి. తినడానికి ఆహారం లేక, ఉండడానికి గూడు లేక జనవాసాల వైపు వచ్చేస్తున్నాయి. గ్రామాల్లోనూ, నగరాల్లోనూ చిరుతలు, పెద్ద పులులు, ఎలుగు బంట్లు తిరుగుతున్న వీడియోలు ఇటీవలి కాలంలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ సింహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. 


ఆ వీడియోలో ఓ సింహం ఇంటి ముందు నడుస్తూ ఉంది. ఆ స‌మ‌యంలో ఒక మహిళ రోడ్డుపై జాగింగ్ చేసుకుంటూ వస్తోంది. సాధారణంగా ఆహారం కోసమో, ప్రాణభయంతోనో మనుషులపై వన్య మృగాలు దాడి చేస్తుంటాయి. అయితే ఈ సందర్భంలో ఆ మహిళకు కనబడకుండా ఉండేందుకు ఆ సింహం పొదల్లో దాక్కుంది (Lion Hiding). ఈ ఘటన ఆ ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా షేర్‌ చేసిన ఈ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Updated Date - 2022-10-01T00:41:20+05:30 IST