న్యూఢిల్లీ, మే 14: ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధానించే విషయ మై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిబంధనలు జారీ చేయనుంది. ఆధార్ వివరాలు సమర్పించడం స్వచ్ఛందమే అయినప్పటికీ, ఇవ్వననడానికి తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా శనివారం పదవీ విరమణ చేసిన సుశీల్ చంద్ర ఈ విషయాలు వెల్లడించారు.