లైనింగ్‌ పనులు కష్టం

ABN , First Publish Date - 2022-05-25T06:39:13+05:30 IST

భూగర్భ జల మట్టం కంటే.. కాలువలు లోతుగా ఉండటంతో జిల్లాలోని వివిధ నీటిపారుదల కాల్వల్లో లైనింగ్‌ పనులు చేయడం కష్టమని రాష్ట్ర టెక్నికల్‌ అడ్వజర్‌ కమిటీ (టీఏసీ) నిర్ధారించింది.

లైనింగ్‌ పనులు కష్టం
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను పరిశీలిస్తున్న నిపుణుల కమిటీ

  1.  నీటి ఊట, పూడికతో పనులకు అవరోధం
  2.   పరిశీలించిన రాష్ట్ర టెక్నికల్‌ అడ్వైజర్‌ కమిటీ 


కర్నూలు, మే 24 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జల మట్టం కంటే.. కాలువలు లోతుగా ఉండటంతో జిల్లాలోని వివిధ నీటిపారుదల కాల్వల్లో లైనింగ్‌ పనులు చేయడం కష్టమని రాష్ట్ర టెక్నికల్‌ అడ్వజర్‌  కమిటీ (టీఏసీ) నిర్ధారించింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, ఎస్‌ఆర్‌ఎంసీ, గోరుకల్లు రిజర్వాయరు, తెలుగుగంగ కాలువలను మంగళవారం ఈ కమిటీ పరిశీలించింది.   సీఈ మురళీనాథ్‌రెడ్డి కన్వీనర్‌గా ఈ కమిటీలో సీఈ-సీడీఓ శ్రీనివాసులు, రిటైర్డ్‌ సీఈ సీడీవో గిరిధర్‌రెడ్డి, రిటైర్డ్‌ ఈఎనసీ రౌతు సత్యనారాయణ సభ్యులుగా ఉన్నారు. వీరు ప్రాజెక్టుల పరిస్థితిని  పరిశీలించారు. రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన (ఆర్‌డీఎంపీ) కింద గాలేరు-నగరి ప్రాజెక్టు వరద కాలువ, ఎస్‌ఆర్‌ఎంసీ కాలువల  లైనింగ్‌ పనులు చేపట్టారు. భూగర్భ జల మట్టం కంటే.. కాలువలు లోతులో ఉండడం వల్ల నీటి ఊటతో నిండిపోతున్నాయి. అలాగే  రెండు మీటర్ల వరకు పూడిక చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి బానకచర్ల క్రాస్‌రెగ్యులేటర్‌ వరకు శ్రీశైలం మెయిన కెనాల్‌, అక్కడి నుంచి గోరుకల్లు రిజర్వాయరు వరకు ఎస్‌ఆర్‌బీసీ కెనాల్‌, గోరుకల్లు నుంచి అవుకు రిజర్వాయర్‌ వరకు జీఎనఎ్‌సఎ్‌స ఫ్లడ్‌ ఫ్లో  కెనాల్‌కు సీసీ లైనింగ్‌ పనులు చేయడానికి  అవరోధంగా మారింది.  నీటి ఊట వల్ల  కాలువ భూమట్టంలో సీసీ లైనింగ్‌ కోసం కాంక్రీట్‌ వేసినా గట్టిపడడం లేదు. దీంతో పనులు చేయలేమని, ఖర్చు పెరుగుతోందని కాంట్రాక్టర్లు ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే.. రూ.280 కోట్లతో తెలుగుగంగ కాలువ సీసీ లైనింగ్‌ పనులు చేపట్టారు. కాలువ విడ్త్‌ పెంచాల్సి రావడంతో గత నిర్మాణాలను కూడా పెంచాల్సి వస్తుంది. ఈ విషయం సీఈ మురళీనాథ్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు ఆయా పనులు, ప్రాజెక్టును పరిశీలించారు. వివరాలు సేకరించడమే కాకుండా  పూడిక ఏ స్థాయిలో చేరిందో  కొలతలు వేసి లెక్కలు తీసుకున్నారు. వెదర్‌ రాక్‌ తొలగించాల్సిన ప్రదేశాల్లో వచ్చే ఇబ్బందులను  క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నం ద్యాలలో ఈ ప్రాజెక్టుల ఇంజనీర్లతో సమావేశ మై వివరాలు సేకరించారు. బుధవారం గోరుకల్లు రిజర్వాయరు నుంచి అవుకు రిజర్వాయరు వర కు జీఎనఎ్‌సఎ్‌స ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ లైనింగ్‌ పనులు, అవుకు టన్నెల్‌ ఫాల్ట్‌ జోన పనులు పరిశీలించనున్నారు. ఈ బృందం వెంటన ఎస్‌ఈ చెంగయ్య  ఉన్నారు. 


Updated Date - 2022-05-25T06:39:13+05:30 IST