బీజేపీలో లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక లొల్లి

ABN , First Publish Date - 2021-04-19T22:41:54+05:30 IST

రాష్ట్ర బీజేపీలో నగరంలోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక

బీజేపీలో లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక లొల్లి

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో నగరంలోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక లొల్లి మొదలైంది. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో కొంతమంది బీజేపీ నాయకులు భేటీ కావడాన్ని బీజేపీ నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అనుమతి లేకుండా మంత్రి కేటీఆర్‌తో ఎలా భేటీ అవుతారని వారిని పార్టీ ప్రశ్నించింది. ప్రగతి భవన్ అంశాన్ని తేల్చేందుకు మాజీ ఎమ్మెల్యే యండల లక్ష్మీనారాయణతో కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ముగ్గురు నేతలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కొంతమంది నాయకులు భావిస్తున్నారు. 



జీహెచ్ఎంసీ ఎన్నికలలో లింగోజిగూడ నుంచి కార్పొరేటర్‌గా బీజేపీ నుంచి రమేష్  గెలుపొందారు. అయితే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆయన అకాల మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రమేష్ కుటుంబం నుంచే ఒకరిని పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని  ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌‌ను కొంతమంది బీజేపీ నాయకులు కలిశారు.

Updated Date - 2021-04-19T22:41:54+05:30 IST