Advertisement
Advertisement
Abn logo
Advertisement

శివోహం

  • బుగ్గక్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. 
  • పుణ్యస్నాణాలు

మంచాల/మొయునాబాద్‌ రూరల్‌: బుగ్గక్షేత్రం శనివారం శివనామస్మరణతో మార్మోగింది. కార్తీక అమావాస్య బుగ్గ జాతర ఆఖరి రోజు బుగ్గరామలింగేశ్వరుడి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. శనివారం ఒక్కరోజే 50వేల మందికిపైగా కార్తీక స్నానాలు ఆచరించారని నిర్వాహకులు తెలిపారు. కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి దండెం రాంరెడ్డి తదితర ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు.


  • కోటి రుద్రాక్ష అర్చణ

మొయునాబాద్‌ మండలం చిలుకూరు ఆలయ సమీప రుద్రాక్షినగరిలో 30 రోజులుగా కొనసాగిన గడపగడపకు రుద్రాభిషేకం కార్యక్రమం శనివారం ముగిసింది. వేదపండితులు రుద్ర మహాయాగం, రుద్రాక్షపందిరి వేసి శ్రీపార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చే భక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Advertisement
Advertisement