బసంత్‌నగర్‌ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2022-01-19T06:08:07+05:30 IST

రామగుండం నియోజకవర్గంలో ఏన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బసంత్‌నగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జితో పాటు రాజీవ్‌ రహదారి వెంట ఉన్న సర్వీస్‌ రోడ్ల నిర్మాణానికి లైన్‌ క్లియ ర్‌ అయినట్లు శాసన సభ్యులు కోరుకంటి చందర్‌ తెలిపారు.

బసంత్‌నగర్‌ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి లైన్‌ క్లియర్‌
సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యే చందర్‌

- రాజీవ్‌ రహదారి సర్వీస్‌ రోడ్లకు మోక్షం

- సీఎం ఆదేశాలతో యంత్రాంగంలో కదలిక

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని, జనవరి 18: రామగుండం నియోజకవర్గంలో ఏన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బసంత్‌నగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జితో పాటు రాజీవ్‌ రహదారి వెంట ఉన్న సర్వీస్‌ రోడ్ల నిర్మాణానికి లైన్‌ క్లియ ర్‌ అయినట్లు శాసన సభ్యులు కోరుకంటి చందర్‌ తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి రామగుండం సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా రాజీవ్‌ రహదారి నిర్మాణం జరిగి టోల్‌గేట్లు పెట్టి టోల్‌ వసూలు చేస్తున్నా బసంత్‌నగర్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం జరుగకపోవడం వల్ల తీవ్ర ఆటంకం ఏర్పడుతోందన్నా రు. అటవీ, రైల్వే శాఖల నుంచి అనుమతులు లేవ నే కారణంతో నిర్మాణాన్ని నిలిపివేశారని, హెచ్‌కే ఆర్‌ సంస్థ పట్టించుకోవడం లేదని తెలిపారు. దీని పై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌  వెంటనే అటవీ, రైల్వే, ఆర్‌అండ్‌బీ, హెచ్‌కేఆర్‌ సంస్థ ఉన్నతాధికారులతో మా ట్లాడి త్వరిగతిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు ఎమ్మెల్యే చందర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తాను ఆర్‌అండ్‌బీ సీఈ మధుసూఽదన్‌రెడ్డి, హెచ్‌కేఆర్‌ ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంతో పాటు రాజీవ్‌ రహదారి వెంట ఉన్న సర్వీస్‌ రోడ్లను నిర్మించడం, జీఎం కాలనీ వద్ద ప్రమాదాలు జరుగుతున్నందున విస్తరణ పనులు చేయాలని కోరామన్నారు. దీనిపై అధికారులు సానుకూ లంగా స్పందించి ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. అధికారులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ గోపాల్‌రావు ఉన్నారు.

Updated Date - 2022-01-19T06:08:07+05:30 IST